హైదరాబాద్

లక్ష్యాన్ని పూర్తిచేసేంత వరకు హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యేంత వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి హరితహారం కార్యక్రమం పురోగతిపై సెక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2.30కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించేంత వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని ఆ దిశగా సెక్టరల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సెక్టోరల్ అధికారిని ఇప్పటికే ఎంపిక చేసుకున్న గ్రామాల్లో తప్పనిసరిగా 40వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేవిధంగా మరోగ్రామాన్ని ఎంపిక చేసుకొని వర్షాకాలంలోపు 40వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయా మండలాలల్లోని నర్సరీల్లో ఉన్న మొక్కలన్నీ తప్పనిసరిగా నాటేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓలకు సూచించారు. ఉపాదిహామి పథకం కింద మంజూరు తీసుకొని ఇప్పటికి మొక్కలునాటని వాటిని సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామంలో 60మొక్కలకు పైగా నాటిన ప్రాంతాన్ని ఫొటోలతో పాటు దిశలను తెలిపే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ఉపాది హామి టెక్నికల్ అసిస్టెంట్లకు శని, ఆదివారం రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ రైతులు, పొలాలు, సంస్థలు, రోడ్లకు ఇరువైపులా, చెరువుల గట్లపై మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత నివ్వాలని ఎంపిడిఓలకు సూచించారు. కోట్‌పల్లి, శివసాగర్ ప్రాజెక్టుల వద్ద అటవీ శాఖ వారు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని డిఎఫ్‌ఓలకు సూచించారు. ప్రతి ఎంఇఓకు ఇప్పుడున్న లక్ష్యానికి అదనంగా మరో 5వేల మొక్కలను నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని వాటిని కూడా పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పిడి హరిత, డి ఎఫ్ ఓలు నాగభూషణం, శ్రీనివాస్, జెడ్‌పి సిఇఓ రమణారెడ్డి, సిపిఓ శర్మ, డిఇఇ రమేష్ ఉన్నారు.