హైదరాబాద్

ఎంజిబిఎస్‌లో ప్రత్యేక నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, జూలై 22: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి.అంజయ్య తెలిపారు. దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ముఖ్యంగా మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అల్లరి, చిల్లరిగా తిరిగే పోకిరీల సమాచారాన్ని సేకరించామన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ‘షి’ టీమ్స్‌ను ఆధునీకరించి, బలోపేతం చేస్తున్నామన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ద్వారా మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. యువత కదలికలు, అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. అమ్మాయిలు ఇబ్బందులకు గురైతే 100 నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
ప్రత్యేక బస్సుల పెంపుపై యోచన
వచ్చే నెలలో జరిగే కృష్ణా పుష్కర ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన అదనపు బస్సుల సంఖ్యలను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా 400 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించగా, యాత్రికుల సందడి అధికమై ఉండొచ్చనే సమాలోచనలతో బస్సుల సంఖ్య 500లకు పెంచేందుకు కసరత్తు చేస్తామన్నారు. వచ్చే నెల 12 నుంచి 23 వరకు ఈ బస్సులు నడుస్తాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, బీచుపల్లి, విజయవాడ ఆపై ఘాట్‌లకు నగరం నుండి బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ఘాట్‌లకు ఐదు నిమిషాలకు ఒక్కో బస్సు బయలుదేరేలా చర్యలు చేపట్టారు.