హైదరాబాద్

అమలులో పారదర్శకతకు బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: వృద్థులు, వితంతు,వికలాంగులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకాన్ని జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అమల్లో పారదర్శకత కోసం ఈ పథకం లబ్ధిదారులందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తిరుమలగిరి మండల రెవెన్యూ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, కంటోనె్మంట్ బోర్డు వైస్ ప్రెసిడెంటు కేశవరెడ్డి, సిఇవో సుజాతగుప్తా, జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఆసరా పెన్షన్ పొందుతున్న వారందరిని బయోమెట్రిక్ ద్వారా గుర్తించాలన్నది జిల్లా యంత్రాంగం లక్ష్యమని, ఇందువల్ల అర్హులైన వారికే పెన్షన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తొలుత లబ్ధిదారులందరిని గుర్తించి నమోదు చేయటం జరుగుతుందని, ఏవైనా కారణాలతో బయోమెట్రిక్ ముద్రలు నమోదు కాకపోతే ఆ కేసులను సరిచేసుకునేందుకు తదుపరి ఒక అవకాశం ఇస్తామని వివరించారు.
ఈ నెల 11నుంచి మొదలైన హరితహారం జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతుందని పచ్ఛదనం పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రుల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ మొక్కలు నాటికే కలిగే ప్రయోజనాలను, మొక్కల పెంపకం వంటి అంశాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రఘురాం శర్మ, తహసిల్దార్లు సునీల్, విష్ణుసాగర్, సైదులు, రాములు, అమర్‌నాథ్, జుబేదాబేగంతో పాటు స్థానిక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ త్వరలో ఇళ్లు
నిలువనీడలేని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి త్వరలోనే పక్కా ఇళ్లను సమకూర్చనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, రాజీవ్ గృహకల్ప పథకాల కింద జిల్లాకు దాదాపు 10వేల 200 ఇళ్లు మంజూరయ్యాయని, వీటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తయిందని, కానీ స్థానిక సమస్యల వల్ల 200నుంచి 300 పేర్లను ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు. ఈ పథకంలో పదిశాతం లబ్ధిదారుల వాటా, ఇరవై శాతం బ్యాంకు రుణం కాగా, మిగిలిన 70శాతం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని, ఇందులో బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటాల్లో కొందరు చెల్లించకపోవటం వల్ల కొంత మేరకు పనులు పూర్తికాలేదని, రెండు నెలల్లో చెల్లించని వారందరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.