హైదరాబాద్

బిల్లుల వసూళ్లపై శ్రద్ధ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జూలై 23: మహానగరవాసులకు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అధికారులు కూడా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ భోలక్‌పూర్ కలుషిత నీటి ఘటన వంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. శనివారం జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి కెటిఆర్ జలమండలి ఎండి దానకిషోర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలమండలిలోని ప్రతి ఉద్యోగి కూడా సేవాధృక్పదంతో పనిచేయాలని సూచించారు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారులకు వరకు ప్రతి ఒక్కరి బోర్డు చూసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కష్టపడి, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, అధికారులకు భవిష్యత్తులో ప్రోత్సాహకాలిచ్చే యోచన ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేగాక, అక్రమ నీటి కనెక్షన్ల నివారణ కోసం వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సేవాధృక్పదం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూనే బోర్డు ఆదాయాన్ని కూడా పెంచేందుకు సిబ్బంది కంకణబద్ధులు కావాలని మంత్రి సూచించారు. బోర్డులో పనిచేస్తున్న సీవరేజీ కార్మికులకు ఇస్తున్న బీమా నుంచి రూ.2లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. జలమండలికి ప్రస్తుతం ప్రతి నెల రూ. 16 కోట్లు లోటు బడ్జెట్ ఉందని, అది సంవత్సరానికి రూ. 170 కోట్లకు పెరుగుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ కూడా వంద శాతం వసూలు చేసుకుంటేనే లోటు నుంచి గట్టెక్కగలమని ఆయన తెలిపారు. ముఖ్యంగా 40 శాతం నీరు నాన్ రెవెన్యూగా సరఫరా అవుతుందని, అంటే అక్రమ నీటి కనెక్షన్లు అధికంగా ఉన్నాయన్నారు. నీటి బిల్లులను సకాలంలో వసూలు చేసేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలమండలిలో 8లక్షల 75వేల నీటి కనెక్షన్లున్నాయని, వీటిలో లక్షా 60వేల నీటి కనెక్షన్లకు మీటర్లున్నాయని తెలిపారు. మీటర్లు బిగించుకునే వారికి అదనంగా ప్రోత్సహకాలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. అయితే వీటిలో కమర్షియల్ నీటి కనెక్షన్లు 32వేలున్నాయని, అయితే నగరంలో ఇది చాలా తక్కువ అని మంత్రి వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో ఉన్న లైన్‌మెన్లు, సిబ్బంది, అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఇపుడున్న నీటి కనెక్షన్లను విచారించి, వాటిని సరైన క్యాటగిరీ కిందకు మార్చినట్లయితే, అలాంటి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సీవరేజ్ క్లీనింగ్ కోసం చిన్నచిన్న గల్లీల్లోకి ప్రస్తుతమున్న యంత్రాలు వెళ్లలేని పరిస్థితులున్నందున, చిన్న సైజు హెయిర్‌టెక్ మిషన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ‘జలభాగ్యం’ పేరుతో ఇంకుడు గుంతలు నిర్మించి, వర్షపు నీటిని పరిరక్షించుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది 2.75లక్షల మ్యాన్‌హోల్స్ ఉన్నట్లు గుర్తించారని, కానీ వాటి సంఖ్య సుమారు 4లక్షల వరకు ఉండవచ్చునని, వాటన్నింటిని జియోట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్లు పి.సత్యసూర్యనారాయణ, అజ్మీర కృష్ణ, డి.శ్రీ్ధర్‌బాబు, డి. రామేశ్వర్‌రావు, రవీందర్‌రెడ్డితో పాటు సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.
నోటీసులివ్వండి..స్పందించకుంటే కనెక్షన్ కట్ చేయండి
సికిందరాబాద్ రైల్వేక్వార్టర్స్‌లో ఇటీవలే చోటుచేసుకున్న కలుషిత నీటి ఘటనను మంత్రి ప్రస్తావిస్తూ బల్క్‌సప్లై నీటిని పరిశుభ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత, కనెక్షన్లు తీసుకున్న వారిపైనే ఉంటుందన్నారు. ఈ విషయంలో వెంటనే సంబంధిత అధికారులు బోర్డుపరంగా ఉన్న బల్క్ నీటి కనెక్షన్లకు నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కనెక్షన్లపై స్పందించని పక్షంలో నీటి కనెక్షన్లను తొలగించాలని మంత్రి ఆదేశించారు.
బోర్డు ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూం
మంచినీటి సరఫరా, డ్రేనేజీ సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగిన పరిష్కరించేందుకు జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల నుంచి వచ్చే సమస్యలు, ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికపుడు లైన్‌మెన్లకు కేటాయించనున్న సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు బోర్డులో 2900మంది లైన్‌మెన్లున్నారని, వీరికి మొబైల్ ఫోన్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇటీవలి వేసవికాలంలో నగర ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా పనిచేసిన అధికారులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా నీటి సరఫరా వేళలు
ఇకపై నీటి వినియోగదారులకు వారి ప్రాంతంలో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను వారి సెల్‌పోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించనున్నట్లు జలమండలి ఎండి దానకిషోర్ తెలిపారు. ప్రాజెక్టుల విభాగంతో పాటు ప్రస్తుతం మెయింటనెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. అక్రమ నీటి కనెక్షన్లకు సంబంధించి వివరాలను సేకరించిన వారికి ప్రోత్సాహకాలివ్వనున్నట్లు తెలిపారు. అక్రమ నీటి కనెక్షన్లు నిర్థారణ అయితే కనెక్షన్ కల్గిన యజమానికి మూడింతల బిల్లును జరిమానాగా విధించటంతో పాటు సమాచారం అందించిన వారికి నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.