హైదరాబాద్

‘మై జిహెచ్‌ఎంసి’యాప్‌కు అంతర్జాతీయ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: మహానగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, అలాగే జిహెచ్‌ఎంసి సేవలైన జనన, మరణ ధృవీకరణ పత్రాలను మరింత త్వరితగతిన పొందేందుకు వీలుగా గ్రేటర్ ఇటీవలే ప్రారంభించిన ‘మై జిహెచ్‌ఎంసి’యాప్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ వస్తోంది. ప్రారంభించిన అనతికాలంలో నగరానికి చెందిన పౌరులే గాక, విదేశాల్లో నివాసముంటున్న నగరవాసులు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం పట్ల జిహెచ్‌ఎంసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 19 దేశాలకు చెందిన హైదరాబాదీలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు. ఇందులో అమెరికాకు చెందిన వారు 240 మంది ఉండగా, యుఏఇకి చెందిన వారు 272 మంది, సౌదీ అరేబియాకు చెందిన వారు 80, సింగపూర్‌కు చెందిన వారు 34, యూకెకు చెందిన 25 మంది, కువైట్ 12, ఖదార్ నుంచి 20 మంది, హాంకాంగ్ నుంచి 16, మలేషియా నుంచి 10 మంది, ఆస్ట్రేలియాకు చెందిన నగరవాసులు 12 మంది, జర్మనీ 8, చైనా 4, బెల్జియం 4, నెదర్లాండ్స్ నలుగురు, బంగ్లాదేశ్, కెనడాల నుంచి ముగ్గురు చొప్పున, ఇతర దేశాలకు చెందిన మరో 46 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ యాప్‌ను 70వేల మంది డౌన్‌లోడ్ చేసుకోవటంతో పాటు ఈ యాప్‌ద్వారా తమ సమస్యలను జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకురావటంతో నగరవాసులు ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నట్లు వెల్లడించారు. వివిధ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు 5వేల 62 ఫిర్యాదులు అందగా, 3440 సమస్యలను పరిష్కరించినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వీటిలో వీధి దీపాలపై 720 ఫిర్యాదులు అందగా, వీటిలో 670 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. వీటితో పాటు 36వేల 874 మంది బర్త్ సర్ట్ఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా, 4వేల 570 మంది డెత్ సర్ట్ఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 947 మంది ఈ యాప్ ద్వారా దాదాపు రూ. 33.60 లక్షల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించినట్లు తెలిపారు. మరో 35 మంది తమ వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్‌లైసెన్సుల రెన్యువల్ నిమిత్తం రూ.లక్ష చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. ఈ యాప్ ద్వారా అందే సమస్యలపై జిహెచ్‌ఎంసి అధికారులు ఎప్పటికపుడు స్పందించి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధవహించటం వల్లే ఈ యాప్‌కు నగరవాసుల్లో ప్రత్యేక నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ యాప్ ద్వారా జిహెచ్‌ఎంసికి సంబంధించిన పలు పనులు అత్యంత వేగంగా, పారదర్శకంగా కూడా జరుగుతున్నట్లు కమిషనర్ వ్యాఖ్యానించారు.