హైదరాబాద్

ప్రత్యేక కొలనుల్లోనే గణేష్ నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: వినాయక నిమజ్జనం ఈ ఏటా జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కొలనుల్లోనే చేపట్టనున్నట్లు గ్రేటర్ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం చెరువుల విభాగం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్ చెరువును కాలుష్యత రహిత చెరువుగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు హైకోర్టుకు స్పష్టం చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా నగరంలో రూ. 6 కోట్ల 95లక్షల వ్యయంతో పది చెరువులను ప్రత్యేకంగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం కోసం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పది చెరువుల్లోనే నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ముందుగానే, సకాలంలో ఈ చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో వ్యవహారించాలని ఆయన ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు వీలుగా కాంట్రాక్టర్లు అవసరమైతే అదనంగా కార్మికులను, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 15వ తేదీలోగా ఈ చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నిర్మాణం వద్ధ సంబంధిత ఇంజనీర్లు విధిగా ఉండాలని కూడా ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో నాణ్యత ప్రమాణాల్లో రాజీపడవద్దని కూడా ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో లేక్స్ డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శేఖర్‌రెడ్డి, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఉత్తమ కార్మికులను గౌరవించాలి
దేశంలోనే ఉత్తమ పారిశుద్ద్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్య గ్రేటర్ పేరుప్రతిష్టలను నిలబెట్టారని, అందుకే ఆయన్ను మనం గౌరవించాలని మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. ఈ నెల 6న ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా దిల్లీలో ఉత్తమ కార్మికుడిగా పురస్కారాన్ని అందుకోనున్న రాజేంద్రనగర్‌కు చెందిన పారిశుద్ద్య కార్మికుడు వెంకటయ్యను మేయర్, కమిషనర్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెంకటయ్యకు పురస్కారం బల్దియా కార్మికులందరికి ఓ చక్కటి గుర్తింపు అని వ్యాఖ్యానించారు. పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ విషయంలో వెంకటయ్య మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచారని, అందుకే ఆయన కార్మికులందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. పారిశుద్ద్య కార్మికులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు గాను స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అవార్డులు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని మేయర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటయ్య పురస్కారం మొత్తం హైదరాబాద్ నగరానికి అందిన అరుదైన పురస్కారంగా భావిస్తామని తెలిపారు. ఈ రకమైన ప్రోత్సాహాన్ని జిహెచ్‌ఎంసిలోని ప్రతి కార్మికుడు, ఉద్యోగికి అందించేందుకు, వారి మధ్య చక్కటి సన్నిహిత సంబంధాలు మెరుగుపడేందుకు గాను తాము ఇప్పటికే గుడ్ ప్రాక్టీస్, పరిచయం కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని వివరించారు. అయితే ఈ నెల 6వ తేదీన పురస్కారాన్ని స్వీకరించేందుకు దిల్లీ వెళ్లనున్న వెంకటయ్యకు మైలార్‌దేవులపల్లి కార్పొరేటర్ విమానప్రయాణ ఛార్జీలను అందించేందుకు ముందుకొచ్చినందుకు కమిషనర్ అభినందించారు. అంతేగాక, వెంకటయ్యకు డ్యూక్ బిస్కట్స్ యాజమాన్యం రూ. 25 నగదును అందించటం పట్ల కమిషనర్ ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. అయితే తమ పరిధిల్లో ఉత్తమ సేవలందిస్తున్న పారశుద్ద్య కార్మికులను గుర్తించి ఇదే రకంగా సన్మానించాలని సివిల్ సొసైటీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలను కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రామకృష్ణారావు, జయరాజ్ కెనడి, శంకరయ్య, భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు.