హైదరాబాద్

రైల్వే అభివృద్ధి పనులు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: రైల్వేశాఖలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అధికారులను ఆదేశించారు.
గురువారం వివిధ భాగాలకు చెందిన రైల్వే అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. నిర్దేశించిన పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తిచేసి రైల్వే అభివృద్ధికి తోడ్పడాలని, కొత్త రైలు మార్గాలు, విద్యుత్ రైలు ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జిఎం రవీంద్రగుప్తా తెలిపారు. నంద్యాల-ఎర్రగుంట్ల, పెద్దపల్లి, నిజామాబాద్, బీదర్-గుల్బర్గా, విష్ణుపురం, మంచిర్యాల-మందమర్రి ప్యాచ్ ట్రిప్లింగ్, కాజీపేట-విజయవాడ మూడవ లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జిఎం ఎకె గుప్తా, ముఖ్య కార్యనిర్వాహక అధికారి భూల్‌చందాని, చీఫ్ ప్రాజెక్టు అధికారి పి శ్రీనివాస్, మేనేజర్ ఎస్‌ఎన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.