హైదరాబాద్

‘మహా’ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: జిహెచ్‌ఎంసిలో కొత్త పాలక మండలి కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా, పరిపాలనలో గానీ, అభివృద్ధిలో గానీ ప్రభావమేమీ కన్పించటం లేదు.
గత ఫిబ్రవరి మాసంలో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు కేవలం ప్రారంభోత్సవాలు, తనిఖీలు, పర్యటనలు వంటి కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం పాల్గొనటం వరకే పరిమితమవుతున్నారే తప్పా, తమను గెలిపించిన డివిజన్ ప్రజల అవసరాలు, ఆకాంక్ష మేరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. అంతేగాక, ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా కూడా తమ కోటాలో కూడా పలు దేవాలయాల వద్ధ పనులు చేపట్టాలని కార్పొరేటర్లు యత్నించినా, వారికంటూ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు తామెన్నో హామీలిచ్చామని, వాటిని నిజం చేసేందుకు మంచినీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి వౌలిక వసతుల కల్పనకు సంబంధించి అనేక పనులు పెండింగ్‌లో ఉన్నట్లు పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. ఇందుకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు ఏటా ఎంత బడ్జెట్ కేటాయించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం వెలువడకపోవటమే ప్రధాన కారణం.
ఇప్పటి వరకు జరిగిన పలు కౌన్సిల్ సమావేశాల్లో ఈ విషయాన్ని మజ్లిస్ సభ్యులు ప్రస్తావించినా, దానిపై కనీసం చర్చ కూడా జరగలేదు. 2007లో నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 2009లో మొట్టమొదటి సారిగా కొలువుదీరిన పాలక మండలి అప్పటి మేయర్ బండాకార్తీకరెడ్డి హయంలో అదే ఆర్థిక సంవత్సరం ప్రతి కార్పొరేటర్‌కు రూ. 50లక్షలు వార్షిక బడ్జెట్‌గా, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం నుంచి రూ. కోటి చొప్పున బడ్జెట్‌ను ఖరారు చేసినా, కానీ ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటై నేటి వరకు కనీసం కార్పొరేటర్ల వార్షిక బడ్జెట్ కూడా ఖరారు కాకపోవటంపై అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 99 మంది కార్పొరేటర్లలో ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా, తుది నిర్ణయం మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తీసుకోవల్సి ఉందని ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా గెలిచి ఆరు నెలలైనా, గత వేసవి కాలంలో కనీసం తాగునీటి కోసం బోర్లు కూడా వేయలని పరిస్థితి నెలకొందని, గెలిచిన నాటి నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని తాము ప్రజల మధ్యకు ఎలా వెళ్లాలంటూ కొందరు కార్పొరేటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన మున్సిపల్ మంత్రి, మేయర్ కార్పొరేటర్ల బడ్జెట్‌ను ఖరారు చేసి, దానికి ఆమోద ముద్రను వేసేందుకు వెంటనే కౌన్సిల్ నిర్వహించాలని కోరుతున్నారు.