హైదరాబాద్

10న వర్గీకరణకు మద్దతుగా ఛలో ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 4: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఈనెల 10న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యార్థి నేతలు స్వామి మాదిగ, కోటా శ్రీనివాస్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. దళిత కులాలన్నింటికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రదాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆయన సభలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, మద్దిలేటి, నర్సయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.