హైదరాబాద్

7న ‘చక్ దే ఇండియా-2 రైడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: కాలుష్య కారకం కాని వాహనం.. తొక్కితే ఆరోగ్యకరమైన సైక్లింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ క్లబ్ ఆధ్వర్యంలో 7వ తేదీన ‘చక్ దే ఇండియా-2 రైడ్’ను నిర్వహించనున్న నిర్వాహకులు వెల్లడించారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బై సైక్లింగ్ క్లబ్, ఆలిండియా బై సైక్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ డి.వి. మనోహర్, హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి, ఆస్ట్రేలియాలోని ఎడ్‌లైడ్ నగర మాజీ మేయర్, స్మార్ట్ సిటీల నిపుణులు స్టీఫెన్ యార్‌వుడ్ మాట్లాడుతూ 7వ తేదీన గచ్చిబౌలీలోని బయోడైవర్శిటీ పార్కుకు ఎదురుగా ఉన్న హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ బైక్ స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న ఈ రైడ్‌ను ప్రదానమంత్రి నరేంద్రమోది జెండా ఊపి ప్రారంభించాలని ఆహ్వానించినట్లు, రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ రైడ్‌ను పది కిలోమీటర్ల మాస్ రైడ్‌గా, 50 కిలోమీటర్ల కాంపిటీటీవ్ ఎండ్యూరెన్స్ రైడ్ అనే రెండు విభాగాలుగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఇందులో పాల్గొనే రైడర్లందరికీ సర్ట్ఫికెట్, టీ షర్టు,మెకానికల్, మెడికల్ సదుపాయాలు కల్పించనున్నట్లు వారు వివరించారు. దీనికి అదనంగా 50 కిలోమీటర్ల ఎండ్యూరెన్స్ రైడ్‌ను పూర్తి చేసిన వారికి పతకాన్ని బహుకరించనున్నట్లు డి.వి. మనోహర్ తెలిపారు. మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు చివరి మైలు వరకు కనెక్టివిటీ అందించేందుకు వీలుగా హైదరాబాద్ బై సైక్లింగ్, మెట్రోరైలు లిమిటెడ్, యూఎన్ హాబిటాట్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 300 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్‌బైక్ స్టేషన్లను నెలకొల్పటం జరుగుతుందన్నారు. ఇందులో 63 మెట్రో స్టేషన్లలో గాను 63 ఎలక్ట్రిక్ బైక్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు రెడ్డి వివరించారు. బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో తొలి దశగా సుమారు పదివేలు ఈ బైక్‌లను పార్కింగ్ చేసి మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వీటిని సౌరశక్తితో ఛార్జింగ్ చేస్తారని, ఇవి పర్యావరణ హితంగా డిజైనింగ్ చేసినట్లు తెలిపారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రపంచలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నగరంలోని మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు, ఫైనాన్షియల్ క్లోజర్ వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశముందని సైక్లింగ్ క్లబ్ చైర్మన్ మనోహర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో అభివృద్ది చెందిన నగరాల్లో, అలాగే హైదరాబాద్ వంటి నగరాలు స్మార్ట్ సిటీగాలు అభివృద్ధి చెందేందుకు ప్రజారవాణ వ్యవస్థ, సైక్లింగ్ ప్రాముఖ్యత ఎలాంటిదో ఎడిలైడ్ మాజీ మేయర్ స్టీఫెర్ యారివుడ్ వివరించారు. ఈ సమావేశంలో బై సైక్లింగ్ క్లబ్ ఉపాధ్యక్షుడు టిఎస్‌ఎన్. రెడ్డి కూడా పాల్గొన్నారు.