హైదరాబాద్

నిర్విరామంగా కొనసాగుతున్న హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ రిజర్వు ఫారెస్టు అటవీ శాఖ ఏర్పాటు చేసిన హరితహారంలో మంత్రి స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న తాండూరు, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో అటవీ శాఖ తరపున అధికంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున వర్షాలు లేవని, తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఉద్యమ స్పూర్తితో మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఆగపల్లి నుంచి జుపల్ మద్యలో ఉన్న 800 ఎకరాల భూమిలో మొక్కలు నాటితే అటవీ ప్రాంతంగా తయారై అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున ప్రతి గ్రామంలో 40వేల మొక్కలను నాటి రికార్డు సృష్టించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, సామాజిక వన విభాగం అధికారి నాగభూషనం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.