హైదరాబాద్

ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలోని వివిధ గ్రామాల ప్రజలకు నీటి సౌకర్యం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.1900కోట్ల హడ్కోరుణంతో అభివృద్ధి పనుల చేపడుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ ఇవ్వాలని సంకల్పించి గ్రేటర్ హైదరాబాద్‌కు అనుకుని ఉన్న శివారు మున్సిపల్ సర్కిల్ ప్రాంతాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు జలమండలి ఆదవర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతోంది. శివారు మున్సిపల్ ప్రాంతాల్లో నూతన నీటి పైప్‌లైన్ నిర్మాణంతో పాటు 56 రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని, జలమండలి ప్రాజెక్టు విభాగం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎండి ఆదేశించారు. రిజర్వాయర్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో పనులను ఎప్పటికపుడు పరిశీలించే విధంగా సిసి కెమెరాలను కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని ఎండి సూచించారు. రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవించిన సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రాజెక్టు అధికారులతో జరిగిన సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఎం.ఎల్లస్వామి, ప్రాజెక్టు విభాగానికి చెందిన డివిజన్ 1 నుంచి 8వరకు గల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.