హైదరాబాద్

మిషన్ భగీరథ ప్రాజెక్టులో..ఇంటింటికీ తాగు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికీ రక్షిత తాగు నీరుతో పాటు ఇంటర్నెట్‌ను కూడా అందించనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్‌కు తెలిపారు.
శనివారం నగరంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి ఇస్రో చైర్మన్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టును ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా పైబర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకుని వచ్చేందుకు ఈ పైబర్ గ్రిడ్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. గ్రామాల ముంగిట్లోకి ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ వంటి సౌకర్యాలు వస్తాయని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ-పంచాయతీ ద్వారా ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సంస్ధలు చేస్తున్న పరిశోధన, ఉత్పత్తులను ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ‘రిచ్’లో ఇస్రో భాగస్వామి కావాలని ఆయన కోరారు. ఈ రిట్జ్‌లో శాశ్వత ఆహ్వానితులుగా ఉండాలని మంత్రి కెటిఆర్ ఇస్రో చైర్మన్ కిరణ్‌ను కోరారు. అందుకు ఇస్రో చైర్మన్ కిరణ్ ప్రతిస్పందిసూ పూర్తి సహయ, సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.