హైదరాబాద్

మహిళలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు సర్కారు తెర దింపింది. అందరూ ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఇందులో 150 సీట్లలో సగం మహిళలకు రిజర్వు చేస్తూ సర్కారు పెద్దపీట వేసింది. దీంతో త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొలువుదీరనున్న పాలక మండలిలో సగం మంది మహిళలే ఎన్నిక కానున్నారు.
వివిధ సామాజికవర్గాలకు చెందిన మహిళలతో పాటు జనరల్ క్యాటగిరీలో కూడా కొందరు మహిళలు పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. కానీ జిహెచ్‌ఎంసి రిజర్వేషన్లను ఖరారు చేసి, సర్కారుకు పంపిన తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేయటంలో ప్రభుత్వం తాత్సారం వహిస్తుందని విపక్షాలు రకరకాల ఆరోపణలు చేసినా, సర్కారు ఎంతో చాకచక్యంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్లకు ఆమోదముద్ర తెలుపుతూ జివోను జారీ చేసిన కొద్ది గంటలకే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం ఈ సారి స్వరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొత్త స్టైలేనని చెప్పవచ్చు.
పలువురి సీట్లు గల్లంతు
2009 నుంచి 2014 వరకు అధికారంలో గ్రేటర్ మొట్టమొదటి పాలక మండలిలో కీలక పాత్ర పోషించిన కొందరు ప్రముఖుల సీట్లు గల్లంతయ్యాయి.
గ్రేటర్ మొట్టమొదటి మేయర్ బండ కార్తీకచంద్రారెడ్డి గెలిచిన తార్నాక డివిజన్ ఈ సారి కూడా మహిళ జనరల్‌కే దక్కటంతో ఆమె మినహా మిగిలిన ప్రముఖుల డివిజన్ల రిజర్వేషన్లు మారాయి.
ఇందులో ముఖ్యంగా మజ్లిస్ మేయర్ మాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ గోల్కొండ రాజ్‌కుమార్, టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అప్పటి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్‌ల సీట్ల రిజర్వేషన్ మారిపోవటంతో వీరికి తలనొప్పి వ్యవహరంగా మారింది. మేయర్ మాజీద్ హుస్సేన్ గెలిచిన అహ్మద్‌నగర్ డివిజన్ ప్రస్తుతం బిసి మహిళకు కేటాయించారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించిన రాజ్‌కుమార్ డివిజన్ కవాడిగూడ ఈ సారి ఎస్సీ మహిళా కోటలోకి వెళ్లింది.
గత ఎన్నికల్లో గోల్నాక డివిజన్ నుంచి గెలిచి, మేయర్ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసి విఫలమై, చివరకు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహారించిన కాలేరు వెంకటేశ్ గెలిచిన గోల్నాక డివిజన్, టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచిన సైదాబాద్ కూడా ఈ సారి మహిళలకే కేటాయించారు.
వీరితో పాటు పాలక మండలిలో ఒకే ఒక్కడుగా గళం విన్పించే అంజదుల్లా గతంలో గెలిచిన ఆజంపురా డివిజన్ మహిళా జనరల్‌కు దక్కింది. మరోసారి పోటీ చేసేందుకు వీరంత సిద్ధంగా ఉన్నా, రిజర్వేషన్లు అందుకు అనుకూలంగా రాకపోవటంతో వారు వేరే డివిజన్ల నుంచి పోటీ చేస్తారా? లేక అదే డివిజన్ నుంచి తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను రంగంలో దింపుతారా? వేచి చూడాలి.