హైదరాబాద్

జర్నలిస్టుల డిమాండ్‌లను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: న్యాయమైన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో అసెంబ్లీనైనా ముట్టడించేందుకు తాము సిద్దమేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టివిక్రమార్క, మాజీ ఎంపి మధుయాష్కి వ్యాఖ్యనించారు. దీర్ఘా కాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్‌లను వెంటనే నెరవేర్చాలని, ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న సమాస్యలను పర్కిరించాలని కోరుతూ జర్నలిస్టులు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా చెపాట్టారు. కార్యక్రమానికి హాజైరన బట్టి విక్రమార్క, మధు యాష్కిలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు పూరె్తైన ఇంత వరకు జర్నలిస్టులకు కనీసం అక్రీడెషన్ కార్డులు సైతం అందలేదని వాపోయారు. సమాజ హితం కోసం శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఇటీవలే మెడికల్ కార్డులను జారీ చేసిన అవి ఏక్కడ కూడా చెల్లుబాటు కావడం లేదన్నారు. అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలస్టుకు ఆరోగ్య కార్డు, డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు, వారి పిల్లలకు ఉచిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్‌లను నేరావేర్చాలని నినాధాలు చేసిన ఈ కార్యక్రమానికి జస్టీస్ చంద్రకుమార్, పలు జర్నలిస్టు సంఘం నేతలు డి.అమర్, విరాత్‌ఆలీ, యాదగిరి, కోటిరెడ్డి పాల్గొన్నారు.