హైదరాబాద్

కృష్ణమ్మ సన్నిధిలో నృత్య విన్యాసాలకు పులకించిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: శ్రావణ మాసంలో పనె్నండు రోజులు కృష్ణానదీ తీరాన భక్తుల తాకిడికి పులకించిన కృష్ణమ్మ కళాకారుల సంగీత నృత్యాలకు పరవశించింది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఘాట్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుష్కరాలను ప్రారంభించగా పనె్నండవ రోజు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ పుష్కరిలలో ‘అ’ ‘ఆ’ లు సాధించామని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రజలకు మొదటిసారిగా పుష్కరాలలో స్నానం చేసే ‘అ’ అంటే అవకాశం ‘ఆ’ అంటే ఆనందం సాధించామని అన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా ఆధ్యాత్మిక భక్తి సాంస్కృతిక సంబరాలతో పనె్నండు రోజులు విజయవంతంగా నిర్వహించి కృష్ణమ్మ ఆశీస్సులు అందుకున్నామని అన్నారు. మహబూబ్‌నగర్ జటప్రోలు ఘాట్ మొదలుకొని నల్లగొండ జిల్లా మట్టపల్లి ఘాట్ వరకు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడగలిగామని అన్నారు. సామాన్య జానపద కళాకారుడు మొదలు శాస్ర్తియ నృత్యం, జానపద నృత్యం, నృత్య నాటకాలతో, భజనలు ప్రవచనాలతో భక్తులకు గంట గంటకి వినోదాన్ని అందించగలిగామని మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ వాగ్గేయకారులు హనుమద్దాసు, రామదాసు, తదితర సంగీత కళామూర్తులను వెలుగులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఒగ్గుకథ, బుర్రకథ, చిందు యక్షగానాలతో పాటు 108 పద్య పౌరాణిక నాటకాలతో పుష్కర ఘాట్‌లలో వినోదాన్ని అందించాము.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కళాకారులందరికి పారితోషికాన్ని అందిస్తున్నామని మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ పుష్కరాలలో పేరిణి కళాకారులకు గౌరవం దక్కింది. జిల్లాల వారీగా వచ్చిన నివేదిక ప్రకారం కళాకారుల పారితోషికం స్టేట్‌మెంట్ తయారుచేసి వీలైనంత త్వరగా ట్రెజరీకి పంపిస్తామని అన్నారు. పుష్కర విజయం తెలంగాణ తల్లికి మణిహారం అని మామిడి హరికృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రవళిక అభినయంలో నర్తన గణపతి
నాట్య మయూరిగా పేరు గడించిన ప్రవళిక కృష్ణా పుష్కరాలలో పశుపాల ఘాట్ దగ్గర ఆనందనర్తన గణపతి నృత్యాంశాన్ని ప్రదర్శించి కృష్ణమ్మ ఆశీస్సులు అందుకున్నానని చెప్పింది. శివాష్టకం, రామాయణ శబ్ధం, కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేక అంశాన్ని కూడా ప్రదర్శించానని చెప్పింది. తన గురువు ఏలేశ్వరరావు వెంకటేశ్వర్లు శిష్యరికంలో పదిహేను సంవత్సరాలు నృత్య శిక్షణ తీసుకొని ప్రస్తుతం స్వయంగా నృత్య శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నానని ప్రవళిక తెలిపింది.
మహిషాసుర మర్ధనంలో శ్రీ వైష్ణవి
మహబూబ్‌నగర్ బీచ్‌పల్లి పుష్కరఘాట్‌లో శ్రీ వైష్ణవి తన నృత్యంలో మహిషాసురమర్ధని అంశాన్ని తన శిష్యులతో ప్రదర్శించానని చెప్పింది. పుష్కరాలలో నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలిపింది.
శ్రావణి నృత్యాభినయం
రంగాపూర్‌ఘాట్ దగ్గర వనం శ్రావణి నృత్యం ప్రదర్శించింది. అక్కడ వేదికపై సరైన ఏర్పాట్లులేవని, కనీసం బ్యానర్ కూడా లేదని చెప్పింది. పుష్కారాలలో ప్రదర్శించాలనే తపనతో నృత్యం చేసానని శ్రావణి చెప్పింది.
వెంకటేశ్వర్లు పేరిణి తాండవ నృత్యం
మహబూబ్‌నగర్ జిల్లా పశుపాల పుష్కరఘాట్‌లోను బతుకమ్మ వైభవం నృత్యంతోపాటు పేరిణి శివతాండవాన్ని కూడా ప్రదర్శించానని నాట్యాచార్యులు కల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. పుష్కరాలలో రెండు అవకాశాలు లభించడం తన అదృష్టం అని ముఖ్యంగా తెలంగాణ గడ్డపై బతుకమ్మ వైభవం ప్రదర్శించడానికి అవకాశం కల్పించినందుకు సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

26న ముగియనున్న బలరామచార్య చిత్రలేఖన ప్రదర్శన

హైదరాబాద్, ఆగస్టు 24: విభిన్న చిత్రలేఖనాలు..అందులో రకరకాల సందేశాలతో ఆకట్టుకున్న దివంగత కవి, చిత్రకారుడు మడిపడగ బలరామాచార్య కుంచె నుంచి జాలువారిన పలు చిత్రలేఖనాల ప్రదర్శన ఈనెల 26తో ముగియనుంది. ప్రతి సంవత్సరం చిత్రలేఖనాలను ప్రదర్శించి, నివాళులర్పించటం ఇక్కడి వేదిక ఆనావాయితీ. ఈ నెల 11వ తేదీన సికిందరాబాద్‌లోని వెస్ట్‌మారెడ్‌పల్లి సమీపంలోని అశ్విన్‌నగర్‌కాలనీలోని బలరాం ఆర్ట్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ చిత్రలేఖన ప్రదర్శనలో అనేక అపురూప చిత్రాలు చిత్రలేఖన అభిమానాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురువారం శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీ కృష్ణుడి చిత్రలేఖనాలను కూడా చివరి రెండురోజుల పాటు ప్రదర్శనలో ఉంచనున్నట్లు నిర్వాహకుల పక్షాన మడిపడగ శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు జివై గిరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శనలోని చివరి రెండురోజుల పాటు శ్రీ కృష్ణుడు వేణుగోపాలుడి రూపంలో దర్శనమిచ్చే పలు చిత్రాలతో పాటు శివపార్వతులు, వేంకటేశ్వరస్వామి చిత్రలేఖనాలు ఇందులో ప్రత్యేకంగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
ముగ్గురు చిత్రకారులతో
‘తిరంగ యాత్ర’
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ తిరంగ యాత్ర నిర్వహించాలన్న ప్రదాని నరేంద్రమోది పిలుపు మేరకు ఇదే వేదికలో మడిపడగ శ్రీకాంత ఆనంద్, చిదంబరం పావులూరి, రాజేందర్‌కుమార్ పొన్నాల కుంచె నుంచి జాలు వారి, దేశభక్తిని చాటే పలు చిత్రలేఖనాలతో ‘తిరంగ యాత్ర’ ప్రదర్శన కూడా కొనసాగుతోంది.