హైదరాబాద్

ప్రజారోగ్యానికి దేవుడే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: నగరం పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బగా తయారైంది. రోడ్డెక్కితే ఎక్కడ ఏ గుంతలో పడుతామో తెలియదు. ఎక్కడి నుంచి కుక్క వచ్చి పిక్క పట్టుకుందో తెలీదు. దోమలు దడ పుట్టిస్తుంటాయి. ఇదీ మహానగరంలో ప్రజలెదురొకంటున్న నిత్యం సమస్యలు. గతంలో ఏడు సర్కిళ్ల నుంచి 24కు పెంచారు. 172 చదరపు కిలోమీటర్ల నుంచి 625 చ.గ. విస్తీర్ణానికి గ్రేటర్ రూపాంతరం చెందినా, ప్రజారోగ్య పరిరక్షణ ప్రశ్నార్థకంగానే తయారైంది. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ ప్రభావం కారణంగా ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. సుమారు 24లక్షల గృహాలు..కోటి జనాభా కలిగిన నగరంలో ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. ఆహార విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టాల్సిన సిబ్బంది ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నగరంలో రోడ్డుపక్కన వెలుస్తున్న చిల్లర వ్యాపారాలు నిబంధనలకు విరుద్ధంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ప్రస్తుతం తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వ్యాధుల భయం పొంచి ఉన్నా, నేటికీ జిహెచ్‌ఎంసి అధికారులు ఒక్క హోటల్ నుంచైనా ఫుడ్ శ్యాంపిల్స్ సేకరించిన పాపానపోలేదు. సర్కిల్‌కు ఒకరు చొప్పున ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్న ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపినా, నేటికీ నియామకాలు జరగలేదు.
ప్రస్తుతమున్న ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నారన్న విషయంపై స్పష్టత లేదు. ప్రజలకు విక్రయించాల్సిన ఆహారాన్ని తయారు చేయటంలో నాణ్యత ప్రమాణాలను, స్వచ్చమైన సరుకులు వాడాల్సిన హోటల్ యజమానులకు వాటికి తిలోదకాలిస్తూ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెంది దాదాపు దశాబ్ద కాలం పూర్తయినా, ప్రజారోగ్య పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హోటళ్లు విక్రయిస్తున్న ఆహారాన్ని తిని గతంలో సామాన్యులు మొదలుకుని, ఐటి నిపుణులు సైతం అస్వస్థతకు గురైన సంఘటలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మాత్రమే బల్దియా అధికారులు హడావుడి చేస్తూ, ఆ తర్వాత అంతా మామూలే అన్నట్టు వ్యవహారిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో, ఇలాంటి ఘటనలు జరక ముందే ఆహార విక్రయ సంస్థలపై నిరంతర నిఘా పెట్టేందుకు తగిన సంఖ్యలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేరంటూ అధికారులు బుకాయిస్తున్నారు.స్వరాష్ట్రంలో కొత్త ప్రభుత్వమైనా ఉమ్మడి రాజధానిలో ప్రజారోగ్య పరిరక్షణను గుర్తించి, సర్కిల్‌కు ఒకరు చొప్పున ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని ప్రజలే గాక, పలువురు బల్దియా అధికారులు కోరుతున్నారు.