హైదరాబాద్

పట్టి పీకుతున్నాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, ఆగస్టు 28:ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వీధి కుక్కలు నడిరోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు..వృద్ధులు తేడా లేకుండా వీధికుక్కల కాటుకు గురవుతున్నారు. జిహెచ్‌ఎంసి వెటర్నరీ శాఖ నిర్లక్ష్యం..వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వెరసి వీధి కుక్కల సమస్య ప్రజల పాలిట శాపంగా మారింది. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు..కాలనీలలో వీధి కుక్కుల ఆగడాలతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. మనుషలపై ఎగబడి మరీ కుక్కలు శరీరభాగాలను పట్టిపీకుతున్నాయి. చిన్నారులను సైతం వదలకుండా కాటు వేస్తున్నాయ. ఇటీవలే కొన్నిరోజుల క్రితం చిన్నారిని ఎత్తుకుని నడుస్తున్న ఓ వృద్ధురాలిపై ఎగబడి కాటేశాయ. చిన్నారి ముక్కు. చెంప భాగాన్ని కొరికడంతో స్థానికులు కాపాడారు. అప్పట్లో హడావుడి చేసిన జిహెచ్‌ఎంసి సిబ్బంది మళ్ళీ షరామామూలే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిహెచ్‌ఎంసిలోని వెటర్నరీ శాఖ అధికాలు వీధి కుక్కలకు సంతాననియంత్రణ ఆపరేషన్‌లు చేసి సమస్య పరిష్కరిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావటం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా మురికివాడలు, కాలనీలు, నిర్మాన్యుంగా ఉండే ప్రాంతాలు అనే తేడా లేకుండా నడి రోడ్లపై కుక్కలు గుంపులుగా విజృంభిస్తూ ప్రజలను బయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెల్లవార్జుము వేళల్లో ప్రజలు జాగింగ్, వాకింక్‌కు వెళ్లాలన్నా, వాహనదారులు బండిని నడపాలన్నా బేంబేలెత్తి పోతున్నారు. స్కూల్ వెళ్లే విద్యార్థులనుండి, రోడ్లపై నడిచే పాదచారులు కుక్క కాట్లకు బలవుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి వీది కుక్కల సమస్య నిర్మూలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.