హైదరాబాద్

జెఎన్‌టియులో ఏబివిపి భిక్షాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 28: పాత మెస్ బకాయిలను రద్దు చేసి ప్రభుత్వం విడుదల చేసే మెస్ చార్జీలను రూ.650 నుండి రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో జెఎన్‌టియులో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకుంట సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రభుత్వం విడుదల చేసే రూ.650 మెస్ చార్జీలు చాలీచాలక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా కోర్సు పూర్తయిన సందర్భంగా హాస్టల్ బిల్లుమొత్తం చెల్లించక, ఇంట్లో ఉన్న బీదరికాన్ని ప్రశ్నించలేక తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు. గతంలో ఎప్పుడో పెంచిన మెస్ చార్జీలు ఇప్పటి పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.650 నుండి రూ.3వేలకు పెంచి పేద విద్యార్థులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భిక్షాటన చేస్తున్న సమయంలో జెఎన్‌టియులో అటెండర్ నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు స్పందించారని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచి విద్యార్ధుల ఇబ్బందులను తొలగించాలని లేని యెడల ఏబివిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి జవ్వాది దిలీప్, శ్రావణ్, తులసీరాం, అశోక్, యాదగిరి, సుకుమార్, స్వరూప్, కుషాల్, సాయిగణేష్, సుధీర్, సురేష్, వినయ్ పాల్గొన్నారు.