హైదరాబాద్

పాతబస్తీ విముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరాను సక్రమంగా నిర్వహిస్తున్న జలమండలి నీటి బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన నీటి కనెక్షన్లను క్రమబద్దీకరించేందుకు జలమండలి విడిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 8.79 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఉన్న నీటి కనెక్షన్లలో అక్రమ నీటి కనెక్షన్లను క్రమబద్దీకరిచేందుకు జలమండలి గడువును సెప్టెంబర్ 30వరకు బిగించారు. నీటి కనెక్షన్లకు సంబంధించి మీటర్లను ప్రతి వినియోగదారుడు తప్పకుండా బిగించుకోవాలని ఈ మేరుకు జలమండలి అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి నోనటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో కేవలం లక్ష 70వేలకు ఉమత్రంమే మీటర్లు బిగించారు. మిగత వాటికి కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసంలోపు ప్రతి వినియోగదారుడు మీటర్లు బిగించుకోవాలని లేకపోతే బిల్లులో రెట్టింపు చేస్తామని జలమండలి పేర్కొంటోంది. మీటర్లు బిగించాలని స్పష్టమైన అదేశాలు జారీ చేశామని జలమండలి పేర్కొంటున్న వినియోగదారుల నుండి స్పందన లభించడం లేదు. దీంతో జలమండలి ఎండి డివిజన్‌లు, సెక్షన్ల వారిగా టార్గెట్‌లు విధించారు. జలమండలి విధించిన గడువులోపు నీటి మీటర్లు బిగించుకుంటే ఏడాది పాటు బిల్లులో రాయితీలిస్తున్నట్లు జలమండలి ప్రకటించింది. అయినా వినియోగదారులు ముందుకు రాకపోవడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న అక్రమ నీటి కనెక్షన్ల కారణంగా జలమండలి ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అక్రమ నీటి కనెక్షన్‌లు కలిగినవారు క్రమబద్దీకరించుకోవాలని, లేనియెడల ఆప్రాంతానికి సంబంధించిన అధికారి, లైన్‌మెన్, మీటర్ రీడర్‌పై జలమండలి చర్యలు తీసుకునే విధంగా పావులు కదుపుతోంది. పాతబస్తీలోని డివిజన్-1, 2 పరిధిలో పెద్ద మొత్తంలో అక్రమ నీటి కనెక్షన్లు ఉన్నట్లు గ్రహించిన జలమండలి అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. అక్రమ నీటి కనెక్షన్ల గుట్టు జలమండలికి సంబంధించిన లైన్‌మెన్, అధికారులకు తెలిసిన తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టడు అన్నట్లు తయారైంది జలమండలిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది తీరు.