హైదరాబాద్

క‘న్నీటి’సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: జలం మహానగర జనంపై కనె్నఠ్రచేసింది. నల్లాలను పొంగించింది. అపార్టుమెంట్లను నీటిలో తేలియాడేలా భయపెట్టింది. వాహనాలు కొట్టుకుపోయాయ. చెరువులు తెగాయ. డ్రైనేజీలు పొంగాయ. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షం నగరవాసులను వణికెత్తించింది. ఈ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీడిమెట్ల ప్రాంతంలో యాభై ఏళ్ల నాగలింగం అనే వృద్దుడ్డు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. అంతేగాక, తరుచూ వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్, సచివాలయం, లిబర్టీ, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, లక్డీకాపూల్, రాణిగంజ్ కూడళ్లు చిన్నసైజు చెరువును తలపించటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయి, భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఉదయం ఆఫీసు వేళలు కావటంతో వర్షంలోనే బయల్దేరిన ప్రయాణికులు రద్దీ కూడళ్లలో గంటల తరబడి వేచి ఉంచాల్సి వచ్చింది. మరికొన్ని సాఫ్ట్‌వేర్, ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. బుధవారం నుంచి రెండు,మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముదంటూ కొద్దిరోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నందున పలు పాఠశాలలు బుధవారం సెలవును ప్రకటించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు వివిధ ప్రాంతాల నుంచి వృత్తి,విద్యా, ఉద్యోగాల నిమిత్తం బయల్దేరిన నగర వాసులు లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ తదితర రద్దీ కూడళ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. 2000 ఆగస్టు 26న నగరాన్ని ముంచెత్తిన వరదల బీభత్సాన్ని ప్రజలు గుర్తుచేసుకున్నారు. రాత్రి నుంచి ఉదయం పదకొండు గంటల వరకు కురిసిన వర్షం ఆ తర్వాత జల్లులుగా కురిసింది. ఫలితంగా బేగంపేటలోని బ్రహ్మణవాడి, అల్లంబావితోట, వడ్డెరబస్తీ,మయూర్ మార్గ్ ప్రాంతాలతో పాటు దేవనార్ అంథుల పాఠశాల పూర్తిగా నీటిలో మునిగిపోయింది. శివారు ప్రాంతాల్లో ఎక్కువ మోతాదులు వర్షపాతం నమోదు కావటంతో చెరువులు, కుంటలు, నాలాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించారు. ఫలితంగా కూకట్‌పల్లి, పికెట్ నాలా ద్వారా ఎక్కువ మొత్తంలో వరద నీరు హుస్సేన్‌సాగర్‌కు చేరింది. సాగర్ మొత్తం నీటి మట్టం 514.5మీటర్లుండగా, బుధవారం మధ్యాహ్నం వరకు 513.41 మీటర్లకు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి హుటాహుటీన సాగర్ దిగువ ప్రాంతాల్లో పర్యటించి నీటి ఉద్దృతిని పరిశీలించారు. దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, గాంధీనగర్, చిక్కడపల్లి, ఫీవర్ ఆసుపత్రి, గోల్నాక తదితర ప్రాంతాల్లో హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాకు ఇరువైపులా ఉన్న ఇళ్లలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేక సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక పునరావాసాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అమీర్‌పేట, పంజాగుట్ట, బంజాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపొర్ ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురవటంతో బంజారాహిల్స్, పంజాగుట్ట చౌరస్తాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. శివార్లలోని కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కూకట్‌పల్లి ప్రాంతాలకు ఎగువన ఉన్న చెరువులు, కుంటలు నిండి ప్రవహించటంతో దిగువ ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ముఖ్యంగా శివార్లలోని బండారి లే అవుట్‌లోని 25 అపార్ట్‌మెంట్లలోకి భారీగా వరద నీరు చేరుకోంది. అల్వాల్ చెరువుకు గండి పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై పార్కింగ్ చేసిన పది కార్లు నీట మునిగాయి. గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ, శని, ఆదివారాల్లో ఓ మోస్తారుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.
బల్దియా అప్రమత్తం
ఇప్పటికే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తినా, మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బల్దియా అప్రమత్తమైంది. మంగళవారం వర్షం కురవటం ప్రారంభం కాకముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఉదయం ఆయన పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా తలెత్తిన సమస్యలను, సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ భారీ వర్షాలతో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం ఫోన్ చేసి ఆదేశించినట్లు తెలిపారు. దీంతో పాటు మున్సిపల్ మంత్రి కెటిఆర్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు కూడా ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక, జిహెచ్‌ఎంసిలో ఏర్పాటు చేసిన రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూంలో షిఫ్టుల వారీగా అధికారులను నియమించినట్లు కమిషనర్ తెలిపారు.
సహాయక చర్యలపై సిసి నిఘా
కొద్దిరోజుల క్రితం నగరంలో జరిగిన వినాయక నిమజ్జనం కోసం నగరంలో నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో వర్షం సహాయక చర్యలను జిహెచ్‌ఎంసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోని ఫేస్ టు ఫేస్ హాల్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో అధికారులు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ వర్షం ఎలా కురుస్తుంది. ఎక్కడ ఎలాంటి సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు? ఇతర ప్రాంతాల్లో ఏ రకమైన సహాయక చర్యలు అవసరమన్న విషయాన్ని ఈ సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
200 బృందాలు..విధి నిర్వహణలో 25వేల మంది
వర్షాకాలం కష్టాలను నివారించేందుకు 200 బృందాలుగా దాదాపు 25వేల మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు క్షేత్ర స్థాయి విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో 96 బృందాలు రోడ్లపై ఏర్పడే గుంతలను అప్పటికపుడే పూడ్చే విధులు నిర్వహిస్తున్నాయని, మరో 119 బృందాలు ఎక్కడైనా చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడినా, వాటిని సకాలంలో తొలగించి ట్రాఫిక్ అంతరాయమేర్పడకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు మొత్తం నగరంలో భారీగా వర్షం కురిసే ప్రాంతాలపై నాలుగు సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికపుడు వరద నీటి ప్రవాహ ఉద్దృతిని పర్యవేక్షించి, అవసరమైన చోట అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. జిహెచ్‌ఎంసితో పాటు జలమండలి, హెచ్‌ఎండిఏ, విద్యుత్, రెవెన్యూ,హైదరాబాద్ మెట్రోరైలు, జాతీయ రహదారుల విభాగాలకు చెందిన అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. వర్షంతో తలెత్తిన ఇబ్బందులను నివారించేందుకు, అత్యవసర సహాయం కోసం నగరవాసులు డయల్ 100, 21111111కు, మై జిహెచ్‌ఎంసి యాప్‌కు గానీ ఫిర్యాదు చేయవచ్చునని ఆయన సూచించారు.
నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలు ప్రజలు, హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాకిరువైపులా ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికోసం తాత్కాలిక పునారావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వీరికి తెలంగాణ హోటల్స్ అసొసియేషన్, ఇతర పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా ఆహార పొట్లాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఎలాంటి సహాయానికైనా సిద్దం
నగరంలో భారీ వర్షాలు కురిసినపుడు ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి సహాయానికైనా తాము సిద్దమేనని నేషనల్ డిజాస్టర్ రెస్క్యు ఫోర్సు కమాండ్ కుశాల్ చంద్ స్పష్టం చేశారు. నగరంలో 40 మంది నిష్ణాతులైన సిబ్బంది తమ బృందంలో ఉన్నారని, భారీ వర్షాలు, ఇతర విపత్తులు సంభవించినపుడు తగు సహాయాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగు ప్రత్యేక బోట్లు, లైఫ్ జాకెట్లు, ఇతర సామాగ్రి సైతం సిద్దంగా ఉంచామని పేర్కొన్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ కూడా నగరంలో పునరావాస కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొంటుందని, అవసరమైతే తమ శఆఖ ఆధ్వర్యంలో 27 ఫైర్ టెండర్లు, ఆరు బోట్‌లు, 240 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.