హైదరాబాద్

ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుందని రవాణా శాఖా మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల చేర్పుల మార్పులపై జరుగుతున్న ఆందోళనలకు స్వస్తి పలికేవిధంగా మంత్రి స్పష్టత ఇచ్చారు. రోజుకో రకంగా కొత్త నినాదాలతో ఉద్యమాలు తలెత్తుతున్న నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రాతినిద్యం వహించిన మంత్రులుగా అనుభవనం ఉన్నవారు సైతం రాజకీయం చేస్తూ స్వలాభం కోసం వికారాబాద్‌లో ఆందోళనలు చేయించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ప్రజల సౌలభ్యం కోసం వారి అభిప్రాయంతో పాటు స్థానిక శాసన సభ్యుల కోరిక మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు 40 ఏళ్ల పోరాట ఫలితంగా వికారాబాద్ జిల్లాగా ఏర్పడుతున్నందుకు సంతోషించాల్సిన కొందరు నాయకులు లేనిపోని సమస్యలు సృష్టిస్తూ ఆందోళనలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఏడు మండలాలతో మల్కాజిగిరి, 12మండలాలతో హన్మకొండ, పది మండలాలతో పెద్దపల్లి ఏర్పడుతుండగా 19 మండలాలతో ఏర్పడబోయే వికారాబాద్‌లో మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్‌లను యదావిదిగా కొనసాగించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మండలాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి గ్రామంలో నివాసితులంతా శంషాబాద్ జిల్లాలో తమ మండలాలను చేర్చాలని, తమ మండలాలకు ఆనుకుని ఉన్న మండలానే్న జిల్లాగా ప్రకటిస్తున్న నేపధ్యంలో దూరంలో ఉన్న వికారాబాద్‌లో చేర్చరాదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల జిల్లాగా ప్రకటించాలంటూ చేస్తున్న ఆందోళనను ఆయన ఖండించారు. రంగారెడ్డి జిల్లాగా ఏర్పడినపుడే వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఉండాలని ఆందోళన చేసినా అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పరిగణలోకి తీసుకోలేదని వారి కల ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ కేంద్రంగానే జిల్లా ఏర్పడుతుందే తప్ప చేవెళ్ల సాధ్యం కాదని దానికి తాను కూడా ఏకీభవించడంలేదని తేల్చి చెప్పారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనే మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలు శంషాబాద్ జిల్లాలో కలుస్తుండగా నవాబ్‌పేట మండలం వికారాబాద్‌లోనే ఉంటుందన్నారు. చేవెళ్ల మండల ప్రజాప్రతినిధులు స్థానికుల అభిప్రాయం మేరకు ఈ మండలాన్ని కూడా శంషాబాద్‌లో కలపాలని వస్తున్న డిమాండ్‌లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చేప్పలేమని స్పష్టం చేశారు. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు సంజీవరావు పట్టుబట్టారని, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా అనుభవం ఉన్న నాయకులు ఎప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియకు స్వస్తిపలికి కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రం వికారాబాద్‌లో ఎలాంటి సౌకర్యాలు కావాలో సదరు పనుల కోసం సలహాలు, సూచనలు ఇచ్చి భారీ నిధులతో వౌలిక సదుపాయాలను కల్పించుకునేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి హితవుపలికారు. ఇప్పటికే ఎస్‌పి కార్యాలయం ఉన్న నేపధ్యంలో కలెక్టరేట్‌తో పాటు మిగిలిన వివిద శాఖల కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో మంచి సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త జిల్లాగా ప్రకటించినా సంతోషపడాల్సిన మీరు నిరాహార దీక్షలకు పూనుకుని విమర్శలు చేయడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. వికారాబాద్ జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొడంగల్ తదితర మూడు మండలాలను స్థానికుల అభిప్రాయం మేరకు విలీనం చేస్తుండగా వికారాబాద్‌లోని గండీడు మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. దసరాకు జిల్లాలో ఏర్పడబోయే కొత్త మండల కార్యాలయాలతో పాటు కొత్త కలెక్టరేట్ నుంచి పరిపాలన ప్రారంభమవుతాయని తెలిపారు.