హైదరాబాద్

వ్యాధుల భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా నాలాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు కాలనీ రోడ్లు, మెయిన్ రోడ్లలోనూ మురుగు నీరు నిల్చి ఉండటంతో దోమల వృద్ధి చెంది ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత మాసం కూడా అడపాదడపా కురిసిన వర్షాల కారణంగా వాతారణం చల్లబడి డెంగీ, స్వైన్‌ఫ్లూ, మలేరియా, డయేరియా వ్యాధుల అనుమానిత లక్షణాలతో ప్రతి ప్రాంతంలో వందల సంఖ్యలో ప్రజలు అనార్యోం బారిన పడిన సంగతి తెలిసిందే! అంతేగాక, వాతావరణం బాగా చల్లబడటంతో స్వైన్ ఫ్లూ వ్యాధి కూడా ప్రబలే అవకాశముండటంతో స్వల్ప అనారోగ్య కారణాలైన జలుబు, జ్వరం వంటి లక్షణాలతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. నెలరోజుల క్రితమే అత్యధిక సంఖ్యలో రోగులు వస్తుండటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంటే ఔట్ పేషెంటు సేవలను ఆసుపత్రి వర్గాలు సాయంత్రం అయిదు వరకు పెంచిన సంగతి తెలిసిందే! అంతేగాక, ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నందున, ప్రస్తుతం ఆసుపత్రిలోనున్న సౌకర్యాలు సరికపోక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మహానగరాన్ని మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలు ముంచెత్తటం, మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రజలకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి వైద్యం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫీవర్ ఆసుపత్రిలో కూడా ఔట్ పేషెంటు సేవలలను సాయంత్రం అయిదు గంటల వరకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు నాంపల్లి ఏరియా ఆసుపత్రి, వివిధ ప్రాంతాల వారీగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లకు కూడా వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
పోలియో వైరస్ కలకలం
నగరంలో మరోసారి పోలియో వైరస్ కలకలం రేగింది. అంబర్‌పేటో-నాగోల్ మూసీన ది నాలాలోపోలియో వైరస్‌ను అధికారులు గుర్తించారు. దీంతో గ్రేటర్, రంగారెడ్డి జిల్లాలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

ఎమర్జెన్సీ నెంబర్లు

జిహెచ్‌ఎంసి-డయల్ -100, 21111111
రంగారెడ్డి -1800425081
జలమండలి 155313,9949930003
అంబులెన్స్ -104,108
పోలీసు -100,040-27852482, 27852333
టిఎస్‌పిడిసిఎల్ - 1912