హైదరాబాద్

ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మాటలు నమ్మవద్దు: సబిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 18: కేసిఆర్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో తన పబ్బం గడుపుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, టిఆర్‌ఎస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పర్‌పల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా బుద్వేల్‌కు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి చెందిన బి.ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివచ్చిన పలువరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా చేయాలని కేసిఆర్ చేస్తున్న కుట్రలను సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌ని వీడిన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నాయకులు ఆ పార్టీ నిజరూపాన్ని తెలుసుకొని సొంత గూటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. పదవులు, డబ్బులు ఎరచూపించి తన వైపు తిప్పుకొని ఇప్పుడు వారిని నిలువునా మోసగించారని పేర్కొన్నారు. గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు ఉనికే లేదని, తప్పుడు సర్వేలు చేయించుకొని ప్రజల్లోకి పంపించి తప్పుడు సంకేతాలను పంపించారని మండిపడ్డారు. పార్టీలో చేరిన వారిలో థామస్, ప్రమోద్, సురేష్, జి.రాజు, సంపత్, సామ్యూల్, వెంకటరత్నం, బుద్వేల్ నాయకులు సదానంద్, బాల్‌రాజ్ ఉన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ ఇంద్రపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దివ్య, లలిత్ వర్రి, ముజ్‌దబా పాల్గొన్నారు.

అందరి గురి రెబెల్స్‌పైనే!
టిఆర్‌ఎస్ తిరుగుబాటుదారులపై కాంగ్రెస్ దృష్టి
వారికే బి ఫారాలిచ్చేందుకు వ్యూహం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులపై పార్టీలు దృష్టి పెట్టారు. పార్టీల పరంగా లోపాయికారిగా ఎలాంటి ఒప్పందాలు, పొత్తులు కుదిరినా, ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి మిత్రపక్షాలు ఎక్కువ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో రకరకాల వ్యూహాలతో మల్లగుల్లాలు పడుతున్నాయి. అత్యధిక సంఖ్యలో 4వేల 69 నామినేషన్లు దాఖలు కావటాన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ ఆరా తీస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 133 డివిజన్లలో సగం మందికి కూడా బి ఫారం ఇవ్వకపోవటానికి తిరుగుబాటు దారులకు గాలం వేయాలన్న వ్యూహమే కారణంగా కన్పిస్తోంది. ఇక టిఆర్‌ఎస్ పార్టీ కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ పార్టీ టికెట్ ఆశిస్తూ అన్ని పార్టీల కన్నా ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. ఒక్కో డివిజన్‌లో అయిదారుగురు కూడా దరఖాస్తులు దాఖలు చేయటాన్ని పార్టీ అధిష్టానం తమకు అనుకూలంగా మార్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో గెలుపు గుర్రాలను అనే్వషిస్తోంది. గెలిచే సత్తా, ఆర్థిక స్తోమత, స్థానికంగా గుర్తింపు, స్థానిక సమస్యలపై మంచి అవగాహన వంటివి కల్గిన వారిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్, టిడిపిలకు చెందిన తిరుగుబాటు దారుల గురించి కూడా టిఆర్‌ఎస్ ఆరా తీస్తోంది. తమ పార్టీ కోసం టికెట్‌ను ఆశిస్తూ నామినేషన్లు దాఖలు చేసిన వారు కాకుండా ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో గెలిచే సమర్ధులను పార్టీలోకి చేర్చుకుని, వారికి బి ఫారం ఇవ్వాలన్నది టిఆర్‌ఎస్ పార్టీ మరో వ్యూహంగా కన్పిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందాన్ని పెట్టుకుని ఎన్నికల్లో గెలవటమే తప్ప, పార్టీని పటిష్టం చేసుకోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్ టికెట్ కోసం నామినేషన్లు దాఖలు చేసిన తిరుగుబాటుదారుల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్ పార్టీ తిరుగుబాటుదారులకు కాంగ్రెస్ టికెట్ అంటగడితే ఆ పార్టీని ఇరకాటంలో పెట్టినట్టేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగోల్ డివిజన్ టిఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థి అనంతుల రాజిరెడ్డికి కాంగ్రెస్ కట్టబెట్టింది. కాంగ్రెహ్ వ్యూహాన్ని తిప్పికొట్టేలా టిఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది.

ఓటరు స్లిప్‌లు మేమే పంచుతాం
రాజకీయపార్టీలు
ఆ పని చేయొద్దు
కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ఏ ఎన్నికలు జరిగినా, ఓటర్లకు దగ్గరయ్యేందుకు వారి ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలను వారికందించేందుకు రాజకీయ పార్టీలు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తుంటాయి. కానీ ఫిబ్రవరి 2న జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా ఈ సారి రాజకీయ పార్టీలు ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయరాదని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బాధ్యత అధికార యంత్రాంగానిదేనని కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి తరపునే ఓటరు స్లిప్‌లను పంపిణీ చేసేందుకు గాను సుమారు 74లక్షల పై చిలుకు ఓటరు స్లిప్‌ల ముద్రణకు టెండర్లను ఆహ్వానించి ప్రింటర్లను ఖరారు చేసిన జిహెచ్‌ఎంసి మంగళవారం సర్కిళ్ల వారీగా ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నట్లు వివరించారు. అంతేగాక, ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఓటరు లిస్టు, ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు, జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ఓటరు స్లిప్‌లు కేవలం ఓటర్లకు తమ ఓటు ఎక్కడ, ఏ పోలింగ్ బూత్‌లో ఉందన్న విషయాన్ని తెలిపేందుకు మాత్రమేనని, ఆన్‌లైన్ ఓటరు స్లిప్ అధికారికంగా ఎలాంటి గుర్తింపు కాదని ఆయన వివరించారు. కేవలం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మాత్రమే ఓటరు స్లిప్ ఉపయోగపడుతుందని, అక్కడ ఓటు వేసేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు, లేక మరో ఇరవై రకాల గుర్తింపు పత్రాలను చూపి ఓటు వేయవచ్చునని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తాము చేపట్టిన చర్యలు చక్కటి సత్ఫలితాలిస్తున్నాయని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌కు ఇప్పటి వరకు లక్షా 25వేల మంది ఓటర్లు సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

పదోతరగతి ఉత్తీర్ణతలో అగ్రగామిగా రంగారెడ్డి జిల్లా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ పి.సునితా మహేందర్‌రెడ్డి విద్యా శాఖాధికారిని ఆదేశించారు. సోమవారం జడ్పీ చైర్‌పర్సన్ చాంబర్‌లో జిల్లా స్థాయి సంఘ సమావేశాలు ఆమె అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా విద్యా, వైద్య, ఆరోగ్య స్థాయి సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాను పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంచే విధంగా విద్యార్థులకు అవసరమైన శిక్షణను ఇచ్చే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆమె అన్నారు.
విద్యార్థులకు ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్యంపై సమీక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని ఆమె సూచించారు. పల్స్ పోలియో సందర్భంగా మిగిలిపోయిన వారికి కూడా చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
అంతకు ముందు గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా ఆర్థికాభివృద్ధికి గాను గ్రామాల్లోని మహిళలకు ఆయా రంగాల్లో శిక్షణనిచ్చి వారి స్వయం ఉపాధికి చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ పిడికి సూచించారు. కొన్ని గ్రామాల్లో అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు అందడం లేదని తన దృష్టికి వచ్చిందని, దీనిపై తగు చర్యలు తీసుకొని పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వాటర్ షెడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని డ్వామా అధికారులకు సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు వీలుగా పొలంగట్లపై చెట్లను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధికిగాను పరిశ్రమల శాఖ ద్వారా రాయితీపై రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో క్యాబ్‌ల నిర్వహణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి విరివిగా రుణాలు అందించాలని ఆమె సూచించారు. గుడుంబ రహిత జిల్లాగా రంగారెడ్డి జిల్లాను ప్రకటించినందుకు గ్రామాల్లో సారా, కల్తీ కల్లు తయారు కాకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించే గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిపిఓను ఆదేశించారు.
గర్బిణి, శిశుసంక్షేమంపై శ్రద్ద
అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాల్లో సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గర్భిణీ, శిశు సంక్షేమంపై శ్రద్ధ వహించాలని జడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డి ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని అలాగే పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం జరిగిన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటి లభ్యత లేనందున రబీలో ఆరుతడి పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినందుకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. కరువు దృష్ట్యా పశుగ్రాసం పెంచేందుకుగాను రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో పశువుల నీటితొట్టెల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. రైతు బజార్లలో తూనికలు సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మె సూచించారు.ఈ సమావేశాల్లో జడ్పీ సిఇఓ రమణారెడ్డి, జడ్పీటిసిలు రమాదేవి, మహిపాల్, సతీష్, లక్ష్మమ్మ, జెకె శైలజ, సునీత, స్వరూప, కళావతి, లక్ష్మమ్మలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దలూ.. ఓటేయండి
చిన్నారులతో జిహెచ్‌ఎంసి ప్రచారం
31లోపు ఓటరు స్లిప్‌లు పంపిణీ
ఓటింగ్ శాతం పెంచేందుకు
సరికొత్త యత్నం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు, సంస్కరణలను ప్రవేశపెట్టిన మహానగర పాలక సంస్థ మరో సరికొత్త ప్రచారానికి తెరదీసేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఇంటికి ఓటరు స్లిప్‌లను అందించే సమయంలో అవి ఆ కుటుంబంలోని చిన్నారుల చేతికిచ్చి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఇరుగుపొరుగు వారు తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు మరో ప్రయత్నం చేయాలని యోచిస్తున్నామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
మరింత పారదర్శకత కోసం..!
మహానగర పాలక సంస్థ ఎన్నికలు మరింత పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే ఆయా డివిజన్లకు రిటర్నింగ్ అధికారులుగా నియమించిన అధికారుల మినహా మిగిలిన సిబ్బంది మొత్తాన్ని ఈ నెల 22వ తేదీన ఆకస్మికంగా మరోసారి బదిలీలు చేయనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వివరించారు. అదే విధంగా పోలింగ్‌లో వినియోగించే ఇవిఎంల కేటాయింపులోనూ పారదర్శకత కోసం అదే రోజు వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో కంప్యూటర్ ద్వారా ఇవిఎంల పనితీరును చెక్ చేయటంతో పాటు వాటిని డివిజన్లకు కెటాయించనున్నట్లు ఆయన తెలిపారు. తమ వద్ద నుంచి ఇవిఎంలు వెళ్లిపోయిన తర్వాత అవి డివిజన్‌కు చేరుతాయని, అక్కడ వాటిని ఏ ఏ పోలింగ్ బూత్‌లకు తరలించాలన్న విషయాన్ని కూడా కంప్యూటర్ ద్వారానే నిర్ణయించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి బూత్‌లో హైదరాబాద్‌తో ఎలాంటి సంబంధం లేని ఇతర జిల్లాలకు చెందిన సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
345మంది బైండోవర్
జిహెచ్‌ఎంసి ఎన్నికల దృష్ట్యా సిఆర్‌పిసి 107,116లను అనుసరించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారని అనుమానాస్పదమైన 345 మంది వ్యక్తులను ఇప్పటి వరకు బైండోవర్ చేసినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. అదే విధంగా 1859 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం, రాజకీయ వైషమ్యాలకు చెందిన రెండు కేసులు నమోదయ్యాయని కూడా ఆయన వెల్లడించారు. అలాగే నగరంలో అనధికారికంగా, అక్రమంగా ఏర్పాటు చేసిన మరో 50వేల పోస్టర్లు, 38వేల బ్యానర్లు, 40వేల 603 ఫ్లెక్సీలు, 5వేల 808 కటౌట్లు తొలగించినట్లు ఆయన తెలిపారు.

మూగ జీవాలను హింసించకండి
పశుగ్రాసం కోసం 50 శాతంతో సబ్సిడీ విత్తనాలు
ఊరూరా నీటి తొట్టెలు
గ్రాసం పెంచే రైతుకు రూ.11 వేలు
జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పిలుపు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: వచ్చే వేసవిలో పశుగ్రాసం కొరత అదిగమించడానికి పశువైద్య శాఖ ద్వారా 50 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి వెల్లడించారు. జిల్లాలోని అన్నీ మండల కేంద్రాలలోని పశువైద్యశాలల్లో విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చొప్ప కత్తిరించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోమవారం పశుసంవర్థక శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో పశువుల ధీన పరిస్థితిపై సునీతారెడ్డి సుదీర్ఘంగా ఆ శాఖ ఆర్డేడీ వరప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జగదీశ్వర్‌తో సమీక్షించారు. వ్యవసాయంలో అండగా ఉండే మూగ జీవాలను హింసించరాదని రైతులను సునీతారెడ్డి కోరారు. వచ్చే వేసవిలో వాటికి దాహార్తిని తీర్చేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.22,000లతో నీటి తొట్టెలు నిర్మించడానికి సర్పంచులు మండల ఉపాధి హామీ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే బోరుబావుల కిందా పశుగ్రాసం పెంచడానికి ఎకరానికి రూ.11,000 చొప్పున రైతులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.