హైదరాబాద్

ఐలమ్మ భవన్ ఏర్పాటుకు కృషి : మంత్రి చందూలాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 26: నగరంలో ఐలమ్మ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర గిరిజన శాఖమంత్రి చందూలాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి సభ సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ భూమి, భూక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కొనసాగిందని తెలిపారు. ఉద్యమ నాయకులు చేసిన పోరాటం భావితరలకు అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. తమ హక్కుల సాధన కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల విముక్తి కోసం ఉద్యమం చేసిందని పేర్కోన్నారు. కులంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. చాకలి ఐలమ్మ లఘు చిత్రాన్ని నిర్మించిండానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు విడుదల చేసిందని అన్నారు. ఐలమ్మ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. రజక సంఘాలు అన్ని ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రజక సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జీవన్ పాల్గొన్నారు.
షాబాద్‌లో..
షాబాద్: ఐల్లమ్మ ఆశయాలకు నిరంతరం కృషి చేస్తామని రంగారెడ్డి జిల్లా రజక సంఘం కార్యదర్శి గడ్డం చంద్రయ్య అన్నారు. సోమవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చాకలి ఐల్లమ్మను తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాకలి ఐల్లమ్మ విగ్రహాన్ని నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రజకులకు ఏలాంటి వౌలిక వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. కార్యక్రమం లోలంబాడి రాములు, మల్లేష్, కిరణ్, సురేష్, రవి, సత్యయ్య, నర్సింలు, అంజనేయులు పాల్గొన్నారు.