హైదరాబాద్

సాధారణ స్థితికి జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అయిదు రోజుల పాటు మహానగరాన్ని కుదిపేసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నగరంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. సోమవారం పనిరోజు కావటంతో నగరవాసులు యథావిధిగా తమ దైనందిన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఈ నెల 21వ తేదీ నుంచి తరచూ భారీవర్షాలు కురవటంతో శివారులోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలతో పాటు నగరంలోని బేగంపేట, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన సంగతి తెలిసిందే. సోమవారం కూడా నిజాంపేట, హకీంపేటలోని పలు ప్రాంతాల్లో వీధుల్లో నీరు నిలిచి కనిపించింది.
ఒకవైపు నీటిని తోడేసేవ పనులతో పాటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయటంతో అక్కడి ప్రజలు ఇపుడిపుడే కోలుకుంటున్నారు.
శివారులోని బాధితులకు సోమవారం కూడా వివిధ రాజకీయపార్టీలు, స్వచ్చంద సంస్థలు ఆహార పొట్లాలు, పాలు, మంచినీరు అందించారు. ఆదివారం, సోమవారాల్లో పెద్దగా వర్షం కురవకపోవటం వల్లే సహాయక చర్యలు నిరాటంకంగా చేపట్టినందున నగరం కొంత మేరకు కోలుకుంటుందని అధికారులు తెలిపారు.
మరో అయిదు రోజుల పాటు నగరానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ ప్రకటించినా, అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయే తప్పా, జనజీవనాన్ని ప్రభావితం చేసే తరహాలో పెద్దగా వర్షం పడలేదు. హుస్సేన్‌సాగర్ నుంచి దిగువకు ఔట్‌ఫ్లోను తగ్గించి ఇంకా నీటిని వదలుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావటంతో రహదార్లపై పెద్దగా రాకపోకలు కన్పించకపోయినా, సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే వాహనాలు రోడ్డెక్కాయి. వాతావరణం పొడిగా మారటంతో రోడ్లన్నీ దుమ్ము రేగిపోతున్నాయి. వాహనదారులెదుర్కొన్న ఇబ్బందులు వర్ణణాతీతం. మాస్కులు ధరించకుండా వాహనంపై ప్రయాణించటం గగనంగా మారింది.
కారణంగా వాహనదారులు కొందరు హెల్మెట్లు, మరికొందరు మాస్కులు ధరించగా, దుమ్ము,్ధళికి తట్టుకోలేక కొందరు చేతి రుమాలును ముక్కుకు కట్టుకుని ప్రయాణించటం కన్పించింది. నిత్యం రద్ధీగా ఉండే ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్టీకాపూల్, రాణిగంజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయం కావటంతో వాహనాలు మెల్లిగా ముందుకు కదలటం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించినట్లు ఆదివారమే కమిషనర్ ప్రకటించినా, మెయిన్‌రోడ్లలో ఎక్కడ కూడా పెద్దగా మరమ్మతులు చేపట్టిన దాఖలాల్లేవు.