హైదరాబాద్

దెబ్బతిన్న చెరువు, కుంటలకు మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు యుద్ధప్రాదిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై సంబధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుతో కలిసి సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 12,812 హెక్టార్లలో పంట నష్ఠం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని 16 మండలాలలోని 147 గ్రామాలలో జరిగిన పంట నష్టంలో 4600 హెక్టార్లలో కందిపంట, 3179 హెక్టార్లలో పత్తి, 2502 హెక్టార్లలో మొక్కజొన్న, 983 హెక్టార్లలో సోయాబిన్, 734 హెక్టార్లలో వరి, 705 హెక్టార్లలో మినప పంట దెబ్బ తిన్నట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో చెరువులు నిండాయని, ఇందులో 870 చెరువులు పూర్తిస్థాయిలో, 500లకు పైగా చెరువులు 80శాతం నిండాయన్నారు. చెరువు, కుంటలకు చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనె చేపట్టాలని, రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులను యుద్ధప్రాదిపదికన చేపట్టాలని ఆదేశించారు. వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా నిజాంపేట్, కుత్భుల్లాపూర్, అల్వాల్ ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి సేవలు అందించాలన్నారు. తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలని ఆదేశించారు. వర్షాల కారణంగా చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాల వల్ల పూర్తిస్థాయిలో దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించాలన్నారు. నిజాంపేటలోని బండారి లేవుట్‌లో వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ మోటార్ల స్థానంలో కొత్తవాటిని ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో వికారాబాద్, కుత్భుల్లాపూర్, బాలానగర్ ప్రాంతాలలో ఎక్కువగా వర్షపాతం నమోదైందని, వర్షాల వల్ల ఆరుగురు మరణించగా ఇద్దరు ఆచూకి తెలియలేదన్నారు. ముంపు ప్రాంతాలలో సహయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.