హైదరాబాద్

వర్షం నష్టం రూ.100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలో నాలుగైదు రోజుల పాటు ఎడతెరపి లేకుండా దంచికొట్టిన భారీ వర్షాల కారణంగా రూ. వంద కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు లెక్కలేశారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా గ్రేటర్ పరిధిలోని దాదాపు 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ధ్వంసమయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు నివేదికలను సమర్పించినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ రోడ్లను మళ్లీ పూర్తి స్థాయిలోనిర్మించేందుకు గాను ప్రభుత్వం నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమవుతోంది. కానీ రొటీన్ మెయింటనెన్స్ కిందకు వచ్చే రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఎక్కువగా లేకపోవటంతో పూర్తి స్థాయిలో నిర్మించేందుకు నిధులు కోరాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. తిరిగి నగరంలోని రోడ్లను ప్రజల ప్రయాణానికి అనువుగా మరమ్మతులు చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే రోజుకి దాదాపు 1500 గుంతలను పూడ్చాలని టార్గెట్‌ను విధిస్తూ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.
మండిపడ్డ మంత్రి?
మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిహెచ్‌ఎంసి ఇంజనీర్ల పనితీరుపై తరుచూ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన మంత్రి కెటిఆర్ మరోసారి మండిపడినట్లు సమాచారం. రెండు నెలల క్రితం రోడ్ల పరిస్థితిపై మంత్రి అధికారికంగా, అర్థరాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేసి రోడ్ల మరమ్మతులకు సంబంధించి ప్రత్యేకంగా వర్క్‌షాప్ పెట్టి ప్రత్యేక పాఠాలు చెప్పినా, అధికారులు ఆయనకు రకరకాల సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి నగరంలో పెద్దగా వర్షం కురవక, వాతావరణం అనుకూలించినా, రద్దీ ప్రాంతాల్లోని రోడ్లకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ఆయన మరో సారి సోమవారం అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అదనపుసిబ్బంది ఇవ్వండి
నగరం ఏడు సర్కిళ్ల నుంచి 18, పద్దెనిమిది సర్కిళ్ల నుంచి 24కు విస్తరించినా, టౌన్‌ప్లానింగ్ విభాగానికి కావల్సిన స్థాయిలో సిబ్బంది లేదని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జిహెచ్‌ఎంసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా 224 మంది టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు అవసరముండగా, వీటిలో కేవలం 21 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే 65 మంది టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్లు అవసరం కాగా, ఇపుడు 55 మాత్రమే ఉన్నారు. మున్ముందు ఆక్రమణలను, అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ముమ్మరం చేసేందుకు గాను ఈ విభాగంలోని ఖాళీలను వెంటనే భర్తీ చేసి, అదనంగా మరో 40 మంది టిపిఎస్‌లను గానీ, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను గానీ డిప్యూటేషన్‌పై నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.