హైదరాబాద్

నీరు నిలిచే రోడ్లకు స్పెషల్ ట్రీట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆన్‌లైన్ సేవలందిస్తున్నామని ప్రకటించుకున్న జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు, అధికారులకు రోడ్ల నిర్మాణంలో శిక్షణనివ్వాల్సిన అవసరముంది. ఇప్పటికే నగరంలోని బంజారాహిల్స్‌లో కిలోమీటరు పొడువున నిర్మించిన వైట్ టాపింగ్ రోడ్డు ఇటీవలి వర్షాలకు అక్కడక్కడ కొట్టుకుపోయింది. అంతేగాక, కొత్తగా వేస్తున్న బిటి రోడ్లు ఎన్ని రోజుల వరకు ఉంటాయో తెలియదు. ఈ క్రమంలో మెట్రోరైలు స్టేషన్ల ఆవరణలో రోడ్లు చాలా కాలం వరకు అందుబాటులో ఉండేందుకు పేవర్ బ్లాక్‌లను వినియోగిస్తున్న నిర్మిస్తున్న మాదిరిగానే రోడ్లను నిర్మించాలని మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అయితే చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి తరుచూ దెబ్బతినే 45 రోడ్లకు ఈ పేవర్ బ్లాక్‌లతో మరమ్మతులు చేపడితే చాలా కాలం వరకు మరమ్మతులు రాకుండా ఉంటాయని మేయర్ భావిస్తున్నారు. గురువారం మేయర్ మాదాపూర్‌లోని నీరూస్ నుంచి శ్రీ పెద్దమ్మ దేవాలయం వరకు కాలినడకన పర్యటించి రోడ్ల నిర్మాణ పనులు, ప్రయాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించారు. ముఖ్యంగా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రహదారి వెంట ఉన్న షాపింగ్ కాంప్లెక్సులు, బహుళ అంతస్తుల భవనాల సెట్‌బ్యాక్‌లు సక్రమంగా లేకపోవటం, ఆక్రమణలు రావటం వంటివి ప్రధాన అడ్డంకులుగా మేయర్ గుర్తించారు. కార్పొరేషన్ నుంచి తీసుకున్న అనుమతుల ప్రకారమే సెట్‌బ్యాక్‌లను వదిలేయాలని, నిర్మాణ స్థలంలో ఆక్రమించిన సెట్‌బ్యాక్‌లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో నిర్మిస్తున్న పేవర్ బ్లాక్ రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 45 ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో పేవర్ బ్లాక్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రూ. 75 కోట్లతో జిహెచ్‌ఎంసి పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 489 రోడ్ల నిర్మిణ పనుల్లో రూ. 66 కోట్ల వ్యయంతో 399 బీటి రోడ్ల నిర్మాణం, రూ. 7 కోట్ల 30లక్షల వ్యయంతో 75 సిసి రోడ్లు, కోటి 40లక్షల రూపాయల వ్యయంతో పేవర్ బ్లాక్‌ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం వేసే రోడ్ల నిర్మాణ ప్రమాణాలను నిరంతరం డిప్యూటీ మేయర్, కమిషనర్, క్వాలిటీకంట్రోల్, ఇంజనీర్లు, జెఎన్‌టియు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, ఐఐటి నిపుణులు సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఇప్పటికే స్పష్టమైన, ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, నాణ్యత ప్రమాణాల విషయంలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని మేయర్ స్పష్టం చేశారు.