హైదరాబాద్

నగరంలో రోడ్ల దుస్థితిపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్, సికిందరాబాద్‌లో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, వీటి మరమ్మతుకు వెంటనే చర్యలు చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు పాడైపోయాయని, వీటి మరమ్మతుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అలాగే రోడ్లను తరచుగా తవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బ్యాంకులో డిపాజిట్
చేయడానికి వస్తే
సొమ్ము దోచేశారు
నిందితుడిని పట్టుకున్న
పోలీసులు
హైదరాబాద్, బేగంపేట్, నవంబర్ 12: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి బ్యాగ్ నుండి డబ్బులు దొంగలించిన సంఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బ్యాంకులో తనవద్ద ఉన్న రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌బిఐ బ్యాంకు వద్ద శుక్రవారం ఉదంయం రూ.5లక్షల విలువచేసే నగదును బ్యాగులో పెట్టుకుని క్యూలో నిల్చున్నాడు. క్యూలో తనతో పాటు వెనుకనే నిల్చున్న కరీంగర్‌కు చెందిన కవాడి గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న రియాజ్ బ్లేడ్‌తో బ్యాగును కట్ చేసి రూ.50వేల రుపాయల కట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితుడు హుస్సేన్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. దీంతో బ్యాగులో నుండి డబ్బులు దొంగలించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. రోజ మాదిరిగానే డబ్బును దొంగలించిన రియాజ్ శనివారం రూ.50వేలను అదే బ్యాంకులో డిపాజిట్ చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మట్టయ్య తెలిపారు.