హైదరాబాద్

‘స్వచ్ఛ’కార్యక్రమాల పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: నగరాన్ని మరింత ‘స్వచ్ఛ‘గా తీర్చిదిద్దటంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే స్వచ్ఛ భారత్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక సిటీ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఈ కమిటీకి మేయర్ బొంతు రామ్మోహన్ చైర్మన్‌గా వ్యవహారించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి మయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు అదనపు, జోనల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీర్లు పాల్గొన్నారు. ‘స్వచ్ఛ్భారత్-స్వచ్ఛహైదరాబాద్’లో భాగంగా నగరంలో పలు చర్యలు చేపట్టామని, వీటి అమలు, పనితీరు, ప్రజల స్పందన, ఇతర మార్గదర్శకాలు అందించటానికి ఈ ప్రత్యేక సిటీ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయాలని మేయర్ రామ్మోహన్ చేసిన ప్రతిపాదనలకు సమావేశం అంగీకరించింది. మేయర్, కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఈ టాస్క్ఫోర్సులో సభ్యులుగా వ్యవహారించనున్నారు. ముఖ్యంగా స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయటం, నిర్వాహణ లోపాలను సవరించటంతో పాటు ఈ కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించటం జరుగుతుందని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి 4వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకోసం మిగిలిన 42రోజుల గడువులో రోజువారి లక్ష్యాలను నిర్థారించుకుని ప్రణాళిక బద్దంగా పని చేయాలని ఆయన సూచించారు. దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో నగరంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ టాయిలెట్ల నిర్వాహణపై డిసెంబర్ 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని, ఈ టెండర్లు ఖరారు కానీ ప్రాంతాల్లో టాయిలెట్ల న ఇర్వాహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల ఆధునీకరణ, కలరింగ్ చేయటంతో పాటు టాయిలెట్లను సూచించే సైనేజీ బోర్డులను ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు.
పది ప్రాంతాల్లో ప్లాస్టిక్ రోడ్లు
నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో నిర్మించిన ప్లాస్టిక్ రోడ్లు మంచి ఫలితాలనిస్తున్నందున, మరో పది ప్రాంతాల్లో ఇలాంటి రోడ్లను నిర్మించాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈస్ట్‌జోన్ పరిధిలోని నాగోల్‌లో నిర్మించిన ప్లాస్టిక్ రోడ్ల మాదిరిగా కనీసం పది రోడ్లను వెంటనే నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి జరగాలని మేయర్ సూచించారు. డిసెంబర్ నెలాఖరు వరకు 75 శాతం వార్డులను ఒడిఎఫ్ వార్డులుగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతివార్డులో కనీసం కనీసం ఇద్దరు స్వచ్ఛ వాలంటీర్లను నియమించాలని సూచించారు. నగరంలోని మార్కెట్లలో కంపోస్ట్ ఎరువుల తయారీకి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువుల తయారీకి తగు పిట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతి వైద్యాధికారి వ్యక్తిగత శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రవికిరణ్, జయరాజ్ కెనడీతో పాటు పలువురు జోనల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.