హైదరాబాద్

మల్కాజిగిరి నీటి ప్రాజెక్ట్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: మల్కాజిగిరిలో తాగునీటి సరఫరా మెరుగుకోసం జలమండలి ఆధ్వర్యంలో రూ.330 కోట్లతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాచెక్టు పనుల్లో దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మల్కాజిగిరిలో నల్లా కొత్తగా ఏర్పాటు చేసిన నీటి కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వెంటనే టెండర్లు పిలువాలని జలమండలి ఎండి ఎం.దానకిషోర్ అధికారులను అదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ అధ్యక్షతన ఆపరేషన్స్ డైరెక్టర్ జి.రామేశ్వరరావు, ఫైనాన్స్ డైరెక్టర్ టి.రవీందర్‌రెడ్డి, శ్రీ్ధర్‌బాబు, ఆజ్మీరాకృష్ణ, ఎం.ఎల్లస్వామి సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన మల్కాజిగిరి మంచినీటి ప్రాజెక్టులో వినియోగదారులకు పాత కనెక్షన్ల పునరుద్ధరణతో పాటు కొత్త కనెక్షన్ల ఆచరణీయ విధానాలను సూచిస్తోందని ఎండి తెలిపారు. కనెక్షన్ చార్జీలు, మీటర్ బిగింపు తదితర పనులు ప్రాజెక్ట్ విభాగం లేదా మెయింటనెన్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాలో ఈ కమిటీ నిర్ణయించనుంది. అంతేకాకుండా టెక్నికల్ డైరెక్టర్, ప్రాజెక్ట్, ఫైనాన్స్ డైరెక్టర్లతో మరో కమిటీని ఎండి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మల్కాజిగిరిలో మీటరింగ్ టెండర్ ఎందుకు విఫలం అయ్యిందో అధ్యయనం చేయడంతో పాటు మార్చి 2017 నాటికి మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవడానికి చేపట్టే విధానాలను సూచిస్తోంది. నీటి కనెక్షన్ కలిగిన ప్రతి వినియోగదారుడు మీటర్‌లు ఏర్పాటుచేసేలా మీటరింగ్ విధానాన్ని సైతం త్వరలో ఖరారు చేయాలని అధికారులను ఎండి ఆదేశించారు. హాడ్కో నిధుల కింద నగర శివారుల్లో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్, డ్రైనేజీ వ్యవస్తకు సంబంధించి పూర్తి జీఐఎస్ మ్యాపింగ్ సైతం చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో నగరం చుట్టూ శివారులో 2700 కిలో మీటర్లు పైప్‌లైన్ పనులు కొనసాగుతాయన్నారు. అంతే కాకుండా 56 రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతుందని ఎండి తెలిపారు. మ్యాన్‌హోల్స్‌కు వీలైనంతా త్వరగా జియో ట్యాగింగ్ ఖరారు చేసి, త్వరగా పనులు మొదలుపెట్టాలని ఎండి సూచించారు. మినీ ఎయిర్ టెక్ యంత్రాలు వినియోగాన్ని సైతం వెంటనే ఖరారు చేయాలని తెలిపారు. ఈనెల 24 వరకు రద్దయిన పెద్ద నోట్లతో జలమండలి నల్లా బిల్లులు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇదే అదనుగా మొండి బకాయిదారుల నుంచి బకాయిలు వసూలు చేయాలని పేర్కొన్నారు. ఆరునెలల కంటే ఎక్కువ బకాయిలు ఉన్న వాణిజ్య వినియోగాదారులు వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. బిల్లులు చెల్లించని వారి నీటి కనెక్షన్లను డిసెంబర్ 15వరకు తొలగించాలని ఎండి ఆదేశించారు. జలమండలి పరిధి పెరుగుతున్న నేపథ్యంలో సెక్షన్ల విస్తరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, అందుకు సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు దానకిషోర్ తెలిపారు. మల్కాజిగిరిలో ఉన్న నల్లా కనెక్షన్లకు 35వేల నీటి మీటర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ నీటి కనెక్షన్లకు సంబంధించి మల్కాజిగిరిలో ప్రస్తుతం ఉన్న నీటి కనెక్షన్లలో 21వేలకు గాను కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, మిగతా మరో 14వేల నీటి కనెక్షన్లకు త్వరలో కొత్తగా వేసిన నీటి పైప్‌లైన్‌ల నుండి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి 35వేల నీటి కనెక్షన్లకు గాను మీటర్లు ఏర్పాటు చేయడం కోసం టెండర్లు పిలువనున్నట్లు అధికారులు ఎండికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్(ఇఎన్‌సి), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన డైరెక్టర్లు పాల్గొన్నారు.