హైదరాబాద్

‘ప్రణవ్’ చిన్నారుల నృత్యంతో ‘ముద్దుగారే యశోదా...!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: అన్నమాచార్య కీర్తనలలోని ‘ముద్దుగారె యశోద...’ కీర్తనను తనదైన శైలిలో ప్రముఖ నాట్యాచారిణి డా. జి. పద్మజారెడ్డి నేతృత్వంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారులు కడురమ్యంగా ప్రదర్శించారు. ప్రణవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ సంస్థ 9వ వార్షికోత్సవంలో భాగంగా సుమారు నూట నలభై మంది శిష్యులతో వివిధ నృత్యాంశాలతో ఆడిటోరియంలో ప్రేక్షకులకు ఆనంద రసానుభూతి కలిగించారు. ‘అదివో అల్లదివో...’, అన్నమయ్య కీర్తన అనంతరం అర్ధనారీశ్వరం, తిల్లాన అంశాలను కూడా ప్రదర్శించారు. శ్రీ రాగంలో త్యాగరాజ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ అంశంలో చిన్నారులు ప్రత్యేకతను ప్రదర్శించారు. లింగాష్టకం, ‘శంభో శివశంభో...’ అంశాలతో శివతాండవ పదవిన్యాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘కృష్ణం కలయ సఖి...’, ‘మూషిక వాహన...’, తదితర అంశాలను చక్కగా ప్రదర్శించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు విశిష్ట అతిధులుగా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
‘స్లేట్’ చిన్నారుల నృత్య సంబరాలు
హైదరాబాద్, నవంబర్ 23: ‘‘పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే అందుకు కారకులలో ఒకరైన తల్లిదండ్రులకు కూడా వారి పెంపకంపట్ల సరైన అవగాహన కల్పించాలనే’’ విషయాన్ని స్లేట్ నమ్ముతూ ఆచరిస్తోంది. స్లేట్ వార్షికోత్సవాలు ఎప్పుడూ రొటీన్‌కు భిన్నంగా, ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని జరుగుతుంటాయి. పిల్లలు ప్రదర్శించే పాటలు, డాన్సులు చక్కని సందేశాత్మకంగా ఉంటాయి. బుధవారం రవీంద్రభారతిలో జరిగిన అబిడ్స్ ప్రీ ప్రైమరీ వార్షికోత్సవం హృద్యంగా జరిగింది. వచ్చిన వారికి ఆనందాన్ని కలిగిస్తూ, మరోపక్క తల్లిదండ్రులకు అవగాహనాత్మకమైన సందేశాలను అందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్షికోత్సవంలో స్లేట్ నర్సరీ చిన్నారులు ముందుగా పాశ్చాత్య గీతాలతో కూడిన నృత్యాలు ప్రదర్శించారు. తరువాత టీచర్స్ నుండి ఒక మంచి బహుమతిగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేయవలసినవి - చేయకూడనివి తెలుపుతూ తల్లిదండ్రుల పాత్రని గురించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఫాస్ట్‌బీట్ సాంగ్స్‌తో కూడిన డాన్స్‌లతో చిన్నారులు అందరినీ అలరిస్తూ వేదికను అదరగొట్టారు. మూడున్నర గంటలపాటు సాగిన కార్యక్రమంలో పిల్లలు ప్రేక్షకులను ఏకాగ్రతతో ఆకట్టుకుని రక్తికట్టించారు.

ట్రస్ట్ పేరిట రూ. పది లక్షలు స్వాహా

శంషాబాద్, నవంబర్ 23: ట్రస్టు ద్వారా ఆర్థిక సాయంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి మహిళల నుంచి పది లక్షల రూపాయల వరకు వసూలు చేసి చేతులెత్తేసిన ఓ మోసగాడిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు(60) మండలంలోని పెద్దషాపూర్ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఓ భవనంలో మహిళాభివృద్ధి ట్రస్టు పేరిట ఆరు నెలల కిందట కార్యాలయాన్ని ప్రారంభించాడు. పదిమంది స్థానిక మహిళలను ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. సుమారు వందకుపైగా మహిళల నుంచి రూ.3500 చొప్పున సభ్యత్వ రుసుమును వసూలు చేశాడు. సభ్యత్వం తీసుకున్న మహిళలకు భవిష్యత్తులో వడ్డీతో పాటు రుణాలు లభిస్తాయని ఆశ చూపాడు. అంతేకాకుండా కొందరు మహిళలను నమ్మించి రూ. 50వేలు, లక్షల చొప్పున వసూలు చేశాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ట్రస్టులో సభ్యత్వం తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేపట్టాడు. నాలుగు నెలల కిందటే ఇతడి చర్యలపై అనుమానం కలిగిన స్థానిక పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ నుంచి పోలీసులకు సైతం సమచారం అందించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉద్యోగులుగా ఉన్న మహిళలు అతడి నుంచి ఎలాంటి మోసం లేదని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. ప్రారంభంలో అతడిని సమర్థించిన మహిళలు కూడా తమ డబ్బులు ఇవ్వాలంటూ బుధవారం కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. నర్సింహులు ద్వారా తాము పూర్తిగా మోసపోయామని గ్రహించిన మహిళలు మరోసారి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వీడిన దేవేందర్ హత్య మిస్టరీ
గచ్చిబౌలి, నవంబర్ 23: అమ్మను చంపేశానని వెకిలిగా చెప్పడంతో మిగతా సోదరుల దాడిలో దేవేందర్ హత్యకు గురయ్యాడని మాదాపూర్ సిఐ కళింగరావు పేర్కొన్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సిఐ కళింగరావు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేందర్ ప్రసాద్ మిశ్రా(34) బీరేందర్ ప్రసాద్ మిశ్రా(28) దేవేందర్ ప్రసాద్ మిశ్రా(26) మహేందర్ ప్రసాద్ మిశ్రా(24) నలుగురు అన్నదమ్ములు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిద్దిఖీనగ్‌లో నివాసముంటూ వివిధ కంపెనీలలో సెక్యూరిటీ గార్డులుగా పని చేసుకుంటున్నారు. దేవేందర్ ప్రసాద్ మిశ్రా మానసిక పరిస్థితి బాగోకపోవడంతో పిచ్చిచేష్టలతో రోజు విసిగేత్తిస్తున్నాడు. దీంతో గత బుధవారం సోదరుడిని మెహదీపట్నంలోని దర్గాకు తీసుకెళ్లి చూపించారు. సాయంత్రం అన్నదమ్ములు దేవేందర్ ప్రసాద్‌ని మందలించారు. పిచ్చివేషాలు వేస్తే అమ్మ దగ్గరికి పంపించి వేస్తామని చెప్పారు. దీనికి దేవేందర్ స్పందిస్తూ ఇంకేక్కడమ్మ.. అమ్మను ఎప్పడో చంపేశానని వెకిలిగా చెప్పాడు. అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ కలవకపోగా ఫోన్‌ని కూడా కాల్చివేశానని చెప్పాడు. కోపోద్రేకులైన అన్నదమ్ములు.. దేవేందర్‌పై దాడికి దిగారు. దాడి చేస్తున్న సమయంలో దేవేందర్ చేతికి కత్తిదొరకడంతో దాంతో ధర్మేందర్ ప్రసాద్ మిశ్రా గొంతు కోశాడు. మరింత కోపంతో దేవేందర్‌పై పిడిగుద్దులు కురిపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బీరేందర్, వ