హైదరాబాద్

పార్కుల నిర్వాహణకు ‘కార్పొరేట్’ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి అనుకూలంగా పచ్ఛదనాన్ని పెంపొందించే దిశగా జిహెచ్‌ఎంసి దృష్టి సారించింది. ఏటా కోట్ల రూపాయలను వెచ్చించి పార్కులు, సెంట్రల్ మీడియా, కూడళ్లలోని పచ్ఛదనాన్ని పెంపొందించేందుకు, పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నా, సిబ్బంది వద్ధ జవాబుదారీతనం లేకపోవటం, చేపట్టిన చర్యలు ఫలించకపోవటంతో ఈ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్‌ఎంసి చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బహుళజాతి సంస్థలు, మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు తదితర పెద్ద సంస్థలకు ఈ పార్కులు, సెంట్రల్ మీడియా నిర్వాహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించి, ఆయా సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఇవోఐ)లను జిహెచ్‌ఎంసి ఆహ్వానిస్తోంది. నగరంలో 159 సెంట్రల్ మీడియాలు, ట్రాఫిక్ ఐలాండ్‌లున్నాయి. ప్రధాన కూడళ్లలో విశాలమైన రోడ్లను విభజించే ఆర ఉముఖ్యమైన సెంట్రల్ మీడియాలతో పాటు గ్రీన్ కర్టెన్, రోడ్‌వేస్ కూడా ఉన్నాయి.
అయితే వీటి నిర్వాహణకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తే ఆయా సంస్థలు తమ ఆదాయంలో రెండు శాతం నిధులను సామాజిక బాధ్యతగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనలను అమలు చేసేలా ఆ సంస్థలు ముందుకురావాలని, ఈ రకంగా ముందుకొస్తే ఆసక్తిని వ్యక్తపరిచిన సంస్థలకు జిహెచ్‌ఎంసి చెరువులు సుందరీకరణ నిమిత్తం దత్తతనివ్వాలని కూడా భావిస్తున్నారు.
వీటి నిర్వహణ ఖర్చులో అయ్యే మిగులు నిధులతో జిహెచ్‌ఎంసి తమ ప్రణాళికలో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించే అంశంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పార్కుల నిర్వాహణలో ఆయా సంస్థలు తమ బాధ్యతలను నిర్వర్తించి విశ్వనగరం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని జిహెచ్‌ఎంసి కోరుతోంది.
సుందరవనంగా మారిన
మురికి కుంట
నిత్యం దుర్గంధం, పశువులు, పలు రకాల జంతువులకు నిలయంగా ఉన్న రాజేంద్రనగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఓ ఖాళీ స్థలం ఇపుడు సుందరవనంగా తయారైంది. ఆకర్షించే గ్రీనరీ, చక్కటి చెట్లు, వాకర్స్‌కు నడకదారి, చిన్నారులకు ఆటవస్తువులు, ఎల్‌ఇడి లైట్ల వెలుగుల్లో ఆ ప్రాంతం జిగేలుమంటుంది. ఎకరం రూ. పది కోట్లు విలువ చేసే రాజేంద్రనగర్‌లోని తాళ్లకుంట చెరువు ఆక్రమణలకు గురవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ కుంటను రక్షించేందుకు చుట్టూ కంచెను ఏర్పాటు చేసి దాదాపు రూ. 63లక్షలు ఖర్చుతో ఈ పార్కుగా రూపొందించారు.
ఈ చెరువు చుట్టూ వాకింగ్ చేసేందుకు దారి, ల్యాండ్ స్కేపింగ్‌తో పాటు పరిసర ప్రాంతాల చిన్నారులు ఆడుకోవడానికి పలు రకాల క్రీడా వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కులో సీవరేజీ నీరు బయటకు ప్రవహించేందుకు వీలుగా ప్రత్యేక పైప్‌లైన్లు వేయటం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, ఈ పార్కును బుధవారం సాయంత్రం మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.