హైదరాబాద్

అదనపు ఏర్పాట్లతో తీరని అవసరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: పెద్దనోట్లను రద్దు చేయటంతో నగదు మార్పిడి, చిల్లర కోసం సామాన్యులెదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు బ్యాంకులు చేస్తున్న అదనపు ఏర్పాట్లు, ఏ మాత్రం ప్రజల అవసరాలను తీర్చటం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో వికలాంగులు, వయోవృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినా, రైతుబజార్ వంటి ప్రాంతాల్లో పాయింట్ ఆఫ్ సేల్ మొబైల్ వాహనాల ద్వారా డెబిట్ కార్డున్న వారికి రోజుకి రూ. 2వేల విలువైన వంద నోట్లను పంపిణీ చేస్తున్నా, ప్రజల అవసరాలు పూర్తి స్థాయిలో తీరటం లేదు. పాత వెయ్యి, 500 నోట్లను మార్కెట్లో మార్చుకునే గడువు నేటితో ముగియనుంది. ఇకపై ఈ నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకును ఆశ్రయించాల్సి ఉండటంతో నేటి నుంచి బ్యాంకుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే బ్యాంకులు తెరవకముందు నుంచే వంద సంఖ్యలో ఖాతాదారులు లైన్లో నిల్చుంటున్నారు. బ్యాంకు పనివేళలు ముగిసినా, ఖాతాదారుల క్యూ తగ్గటం లేదు. నగరంలోని పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో తెచ్చిన కొద్దీ నగదు అయిపోవటంతో కొన్ని బ్యాంకులు మధ్యాహ్నమే మూతపడుతుండటంతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు పరిమితి ఉన్నా, క్యూలైన్‌లో ఉన్న ఖాతాదారులందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కోక్కరికి రూ. 6వేలను చెల్లించిన సందర్భాలున్నాయి. వెయ్యి, 500 నోట్లను రద్దు చేసి 17 రోజులు గడుస్తున్నా, బ్యాంకుల్లో ఏ మాత్రం రద్దీ తగ్గకపోవటం, ఏటిఎంల నుందు కిలోమీటర్ల పొడువు క్యూ లైన్లు దర్శనమివ్వటం ప్రజల ఇబ్బందులకు నిదర్శనమని ఖాతాదారులు వాపోతున్నారు. నల్లధనం బయటకు తీయటంతో పాటు ఉగ్రవాదులు చెలామణి చేస్తున్న నకిలీ కరెన్సీకి బ్రేక్ వేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంత వరకు నల్లధనం బయటకొస్తుందో? నకిలీ కరెన్సీ చెలామణికి ఏ మేరకు అడ్డుకట పడుతుందో తెలీదు గానీ పేదలు పప్పన్నం తినేందుకు కూడా అనేక ఇక్కట్లు పడాల్సిన దుస్థితి తలెత్తిందని ఖాతాదారుల వాపోతున్నారు. ఎస్‌బిఐ వంటి జాతీయ బ్యాంకులు ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ప్రతి రైతు బజార్ వద్ధ ఓ పాయింట్ ఆఫ్ సేల్’ మొబైల్ వ్యాన్లను అందుబాటులోకి ఉంచి, ఒక్కో డెబిట్ కార్డుదారుడికి రూ. 2వేల నగదును ఇస్తున్నారు. అందులో అడిగిన వారికి వంద నోట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. కానీ ఒక్కసారి రూ. 5లక్షల విలువైన వంద నోట్లను అందుబాటులో ఉంచితే అవి కేవలం గంట నుంచి గంటన్నర వ్యవధిలో అయిపోవటం, లైన్ చూస్తే మరో అరకిలోమీటరు పొడువున ఉండటంతో ఏం చేయాలో తెలీక బ్యాంకు అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో రూ.2వేల నోటు స్థానంలో రూ. 500 నోటును ఇప్పటికే అందుబాటులోకి తెచ్చి ఉంటే, ఇంత కష్టమయ్యేది కాదని ఖాతాదారులే గాక, కొందరు బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని అటకెక్కించి మద్యం మత్తులో ముంచుతున్నారు: టిడిపి

సికిందరాబాద్, నవంబర్ 23: తెరాస ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని టిడిపి జాతీయ కమిటీ అధికార ప్రతినిధి ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎక్సైజ్ కార్యాలయం ముందు టిడిపి నగర కన్వీనర్ ఎంఎన్.శ్రీనివాస్, కోకన్వీనర్ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరవింద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ వందలాదిమంది యువజన విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని ప్రజలు ఆశపడ్డారని, కాని రెండున్న సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వం అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజల ఆశలను వమ్ము చేసిందని ఆరోపించారు. కుటుంబ పాలన కొనసాగిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతోపాటు అవినీతి విధానాల ద్వారా వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా డబ్బును సంపాదించాలని చూస్తున్నారన్నారు. కెసిఆర్ దొర పాలనలో రాష్ట్రం ముఖ్యంగా రాజధాని నగరంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ, దేశంలోనే మద్యం అమ్మకాలలో తెలంగాణ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందని, సాక్షాత్తూ సిఎం ఎక్సైజ్ అధికారులను అభినందించడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. నగరంలో కల్లు అమ్మకాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి కల్లుగీత కార్మికులను ఉద్ధరిస్తున్నట్టు చెబుతూనే మరోవైపు చీప్‌లిక్కర్‌ను ప్రభుత్వమే ప్రవేశపెట్టి గీత కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ఇక కల్తీకల్లుతో పడుతున్న కష్టాలను ప్రతి నిత్యం ఎక్కడ రోడ్లపై చూసినా కనిపిస్తూనే ఉన్నాయన్నారు. కల్తీకల్లు, మరోవైపు పర్మిట్ రూమ్‌లంటూ ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేసి అనుమతులు ఇవ్వడం, దీంతో జనం లైన్లు కట్టి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ రోడ్లపై మహిళలను వేధించడమే కాకుండా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మందు బాబులు పార్కింగ్‌లు చేస్తూ వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం తప్ప కల్తీని నివారించాలన్న లక్ష్యంతో పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం కేవలం ఆదాయం సంపాదించే శాఖగా అధికారులను ప్రోత్సహించడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యం, వారి రాష్ట్ర భవిష్యత్ కేసిఆర్ సర్కార్‌కు అక్కరలేకుండా పోయిందని ఆరవింద్‌కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్లు విదేశీ మద్యం అమ్మకాలకు కూడా అనుమతులు మంజూరు చేయడంతో ఇక అడుగడుగునా నగరంలో మద్యం ఏరులై పారుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదన్నారు. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా కాకుండా తాగుబోతుల తెలంగాణగా కెసిఆర్ తీర్చిదిద్దాలని చూస్తున్నారా? అని అరవింద్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. విచ్చల విడి మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తెదేపా నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ధర్నా కొనసాగిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కూన వెంకటేశ్‌గౌడ్, లక్ష్మన్‌నాయక్, లంకెల దీపక్‌రెడ్డి, వనం రమేశ్, భజరంగ్‌శర్మ, మేకల హర్షకిరణ్, నల్లెల కిశోర్ తదితరులు పాల్గొన్నారు.