హైదరాబాద్

బడ్జెట్‌పై తర్జనభర్జన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: రానున్న ఆర్థిక సంవత్సరానికి(2017-18)కు గాను జిహెచ్‌ఎంసి రూపొందిస్తున్న బడ్జెట్‌పై అధికార యంత్రాంగం తర్జనభర్జన చేస్తోంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2016-17కు రూ. 5550 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు సుమారు రూ. 143 కోట్లను పెంచుతూ అధికార యంత్రాంగం బడ్జెట్ ముసాయిదాను తయారు చేసింది. రానున్న ఆర్ధిక సంవత్సరాల బడ్జెట్‌పై గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థారుూ సంఘంలో చర్చించాల్సి ఉండగా, ఈ అంశాన్ని వచ్చే వారానికి వాయిదా వేశారు. గత సంవత్సరం రూపొందించిన బడ్జెట్‌లో జరిపిన కేటాయింపుల్లో కనీసం యాభై శాతం కూడా సక్రమంగా వెచ్చించలేని అధికారులు గత సంవత్సరంతో పోల్చితే రానున్న ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌ను స్వల్పంగా పెంచారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, వసూళ్లు గత సంవత్సరం కన్నా స్వల్పంగా పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కన్పిస్తోంది. గత సంవత్సరం రూ. 1250 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా, అందులో రూ. 1100 కోట్ల పై చిలుకు వసూలు చేయగలిగారు. ఈ సారి రూ. 1500 కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు ఇప్పటికే పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం రద్దు చేసిన నోట్లతో సైతం పన్ను చెల్లింపులను స్వీకరిస్తున్నారు. కానీ అధికారులు నిర్ణయించే బడ్జెట్ సంఖ్య స్థారుూ సంఘం, కౌన్సిల్‌లో సభ్యుల అభిప్రాయల మేరకు మారుతూ ఉంటుంది. కానీ గతంలో వార్షిక బడ్జెట్‌కు సంబంధించి మజ్లిస్ నిర్ణయించిన విధంగానే బడ్జెట్ రూపకల్పన జరిగేది. కానీ ఈ సారి కౌన్సిల్‌లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి 150లో 99 మంది కార్పొరేటర్లున్నా, స్థారుూ సంఘంలో కూడా పెద్దచేయి ఉన్నా, మజ్లిస్ సభ్యులు, అధిష్టానం అభిప్రాయం తీసుకున్న తర్వాతే బడ్జెట్ ఖరారవుతుందన్న చర్చ లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ మాసం చివరి కల్లా స్థారుూ సంఘం ఆమోదం తెలిపి, డిసెంబర్ మాసంలో బడ్జెట్‌పై కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. కానీ ఈ సారి కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. వచ్చే వారం జరగనున్న స్థారుూ సంఘం సమావేశంలో బడ్జెట్‌పై చర్చించి, స్వల్పంగా మార్పులు జరిపి, ఆ తర్వాత ఆమోదం కోసం కౌన్సిల్ నిర్వహించి డిసెంబర్ రెండోవారానికల్లా ప్రభుత్వానికి పంపాలని భావిస్తున్నారు.