హైదరాబాద్

అదనపు ఆకర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ట్యాంక్‌బండ్ అంటేనే కొద్దిరోజుల క్రితం వరకు గుర్తుకొచ్చేది బుద్ధవిగ్రహం. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంటే బుద్ధ విగ్రహం సరసన భారీ జాతీయ పతాకం కూడా స్థానం దక్కించుకుంది. ఇపుడు తాజాగా ముంబైలో మాదిరిగా సముద్రతీరంలో కన్పించే లవ్ ముంబై మాదిరిగా అక్షరాలతో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ శిల్పం దర్శనమివ్వనుంది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి ఎదురుగా ‘లవ్’ అనే హిందీ భాషలోని భారీ పదాలు ఎరుపురంగులో, దానికి పక్కనే ‘హెచ్‌వైడి’(హైదరాబాద్) అనే ఆంగ్లపదాలకు సంబంధించిన అందమైన భారీ అక్షరాలు తెలుపురంగులో దర్శనిమిస్తున్నాయి. హిందీ, ఆంగ్ల పదాలకు వేర్వేరుగా వేసిన రంగులు మరింత ఆకర్షనీయంగా కన్పిస్తున్నాయి. సుమారు 8.3అడుగుల ఎత్తు, అయిదు అడుగుల వెడల్పుతో ఒక్కో అక్షరాన్ని ఏర్పాటు చేసిన పనులు గురువారం సాయంత్రానికి ముగియటంతో, ఈ లవ్ హైదరాబాద్ చిహ్నాన్ని శుక్రవారం మున్సిపల్ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పర్యాటక శాఖ, జిహెచ్‌ఎంసిలు ఏర్పాట్లు చేశాయి. ట్యాంక్‌బండ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ సింబర్ వద్ద నిల్చోని ఫొటో దిగితే సాగర్‌కు అటువైపున్న తీరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ పతాకం కూడా పడే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు.
నగరానికి వచ్చేసి పర్యాటకులు, నగరవాసులు ఈ అందమైన లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద సెల్ఫీలు తీసుకుని మధురానుభూతుల్ని పొందేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఆర్ట్ ఎట్ తెలంగాణ, కళాకృతి ఫౌండేషన్, జిహెచ్‌ఎంసి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ లవ్ హైదరాబాద్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, నగర అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేంద్ర గురువారం సాయంత్రం పరిశీలించారు.
సరికొత్త ఆకర్షణగా నిలుస్తోంది
ప్రభుత్వ సలహాదారు పాపారావు వెల్లడి
ట్యాంక్‌బండ్‌పై కొత్తగా ఏర్పాటు చేసిన ఈ లవ్‌హైదరాబాద్ సింబర్ నగరవాసులతో పాటు పర్యాటకులకు సరికొత్త ఆకర్షణగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు అభిప్రాయపడ్డారు. ఈ నెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన ‘స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్’ ముగింపు ఉత్సవంలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ఈ సింబల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగానే ఎంఎస్ మక్తా, నెక్లెస్‌రోడ్డుల్లో వేసిన పెయింటింగ్‌లను మంత్రి కెటిఆర్ తిలకించినానంతరం సాయంత్రం అయిదు గంటలకు ఈ లవ్ హైదరాబాద్ సింబల్‌ను ప్రారంభిస్తారని పాపారావు తెలిపారు