హైదరాబాద్

సిబ్బందిపై సర్వే చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సంస్థ పరిధిలోని 83 శాఖ గ్రంధాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తి వివరాలను తనకు అందజేయాలని, సిబ్బందిపై సర్వే నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ పర్సన్ ఇన్‌ఛార్జి ఎం. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో నగర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో శాఖా గ్రంథాలయాల్లో ఏ ఏ క్యాడర్‌లో ఎంత మంది సబ్బంది పనిచేస్తున్నారు? వారిలో రెగ్యులర్ సిబ్బంది ఎవరెవరు? ఔట్‌సోర్సు, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారెంత మంది? అన్న వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని సూచించారు. సిటీ గ్రంధాలయ సంస్థకు ప్రతిరోజు ఎంత మంది పాఠకులొస్తున్నారు? వారిలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారెంత మంది? బడుగు బలహీనవర్గాల వారెందరు? అన్న వివరాలను తెల్సుకునేందుకు సర్వే నిర్వహించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ కార్యక్రమాలు, నిధులు, ఖర్చు పద్దును సమీక్షిస్తూ చైర్ పర్సన్, సిటీ సెంట్రల్ లైబ్రరీకి కేటాయిస్తున్న బడ్జెట్లో సింహభాగం సిబ్బణది జీతభత్యాలకే వెచ్చిస్తున్నట్లు గుర్తించారు. గ్రంథాలయాన్ని పాఠకుల అభిరుచికి తగ్గట్టుగా, ముఖ్యంగా కెరీర్ గైడెన్స్‌కు వచ్చే యువత అవసరాలకు తగినట్టుగా అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయానికి విచ్చేస్తున్న రోజువారి పాఠకుల్లో 60 శాతానికి పైగా బడుగువర్గాల పేదలున్నట్లయితే ఎస్సీపి నిధుల నుంచి బడ్జెట్ కేటాయించాల్సిందిగా కోరారు. ఆ నిధులతో లైబ్రరీలలోని సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరముందని ఆమె సూచించారు. అందుకే పాఠకుల సర్వేను చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సిటీ గ్రంధాలయా సంస్థ ఇన్‌ఛార్జి సెక్రటరీ ఎవిఎస్.రాజు మాట్లాడుతూ 2014-15,2015-16ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు, ఖర్చులను వివరించారు. ఈ సమావేశంలో సభ్యులు ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.