హైదరాబాద్

మారుమూల గ్రామాలలో సోలార్ ల్యాంప్‌ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈనాటికి కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేక అక్కడి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయా ప్రాంతాలు పర్యటించి అక్కడి ప్రజల సాధకబాధలు తెలుసుకొని చేతనైన సహకారం అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ, గోల్-4 స్వచ్ఛంద సేవా సంస్థ ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరు మండలంలోని లండిగూడ గ్రామాన్ని చేరి సేవలు అందించారు. నగరానికి తిరిగివచ్చిన ఆ బృందం శుక్రవారం మీడియాతో అనుభవాలు పంచుకున్నారు. ఇరవై మంది సభ్యులతో వున్న ఆ బృందంకు నాయకత్వం వహించిన సంస్థ రేడియన్స్ విభాగం వైస్‌చైర్మన్ ఎం.నందగోపాలరెడ్డి, డైరెక్టర్ అమూల్య బొట్ల, శ్రీనిధి ఎర్రబాటి తదితరులు మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ సభ్యుడు వెంకటేశ్వరరావును కలసి ఆదివాసీల స్థితిగతులను తెలుసుకున్నామని చెప్పారు. అక్కడ నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు కాలినడకన సాగించి మార్గమధ్యంలో సుందర మనోహర గుట్టలు, లోయలు తిలకిస్తూ లండిగూడ గ్రామాన్ని చేరామని కొంతమంది ఆదివాసీలు చీకట్లో ఎలా మగ్గుతున్నారో, ఆ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఆ గ్రామంలో సోలార్ దీపాలు వెలిగించడానికి అసరమైన ఏర్పాట్లను చేశారు.
ఎనిమిది సోలార్ ల్యాంప్‌లను ఏర్పాటుచేసి వారి చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించామని వారు గర్వంగా చెప్పారు. 380 కి.మీ. సాగిన తమ జర్నీకి ‘మైల్స్ ఎవే ఫర్ ఎ మిలియన్స్ స్మైల్స్’ అనే నినాదంతో యువత చేపట్టిన స్వచ్ఛంద సేవా యాత్ర అని వారు పేర్కొన్నారు.