హైదరాబాద్

పాత పద్ధతిలోనే సొసైటీల రిజిస్ట్రేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని 11 బిసి కులాల ఫెడరేషన్లలోని సొసైటీలను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారని తెలంగాణ రజక సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో బిసి కులాల ఫెడరేషన్ల రాష్ట్ర నాయకుల బృందం మంత్రి జోగురామన్నను కలిసి వినతి పత్రాని అందజేశారు. అనంతరం కొండూరు సత్యనారాయణ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాడిన తరువాత 11 బిసి కులాల ఫెడరేషన్లలోని సొసైటీలకు 50శాతం సబ్సిడీతో 30 లక్షల రూపాయల యూనిట్ ధర పెంచి రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేయడంతో సోసైటీల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. బిసి కులాల ఫెడరేషన్లలోని కొత్తగా ఏర్పాటు చేసుకునే సోసైటీలను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయడానికి రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జివో 6ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కల్కురి రాములు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పగిళ్ల సైదులు, పగడాల లింగయ్య, ఖమ్మం పాటి సాయిబాబా, ఐతరాజు, వెంకటేష్, కేతూరి రంగస్వామి, చిట్యాల రామస్వామి, ముదిగొండ మురళీ పాల్గొన్నారు.