హైదరాబాద్

టిడిపి రైతు పోరుకు జిల్లా నుంచి పదివేల మంది రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈనెల 30న మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించే రైతుపోరుకు వికారాబాద్ జిల్లా నుండి పది వేల మంది రైతులను తరలించాలని వికారాబాద్ జిల్లా టిడిపి అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ జి.సుభాష్‌యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన జిల్లా టిడిపి ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలన రైతులు, విద్యార్థులు, యువతను అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. రైతుల రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తున్న ప్రభుత్వం, 2800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం 20 మందికైనా ఆరులక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, జిల్లాలో ఒక్కరికి ఎడారి భూమి ఇచ్చారని, అందులో కనీసం బోర్ మంజూరు చేయలేదని తెలిపారు. లబ్దిదారులను ఎంపిక చేయడం, భూమి కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు. 50 శాతంపై సబ్సిడి ఇచ్చింది కేవలం టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకేనని ఆరోపించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా టిడిపి ఆధ్వర్యంలో పోరాటాలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు రెండువేల కోట్లు ఫీజురీయంబర్స్‌మెంట్, 600 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా విద్యార్థులను వేధిస్తున్నారని వాపోయారు. టిఆర్‌ఎస్ పార్టీని రెండు వేల కిలోమీటర్ల లోతున ప్రజలు పాతేస్తారని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలో టిడిపి బలంగా ఉందని, ప్రస్తుతం మంత్రిగా ఉన్న మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి జిల్లాలో పార్టీని నడిపారని, పదవి లేకుండా పదవిని నడిపిన వారే నిజమైన నాయకుడని చెప్పారు. భవిష్యత్ టిడిపిదేనని, కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, టిడిపి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిందని, పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇరువర్గాల వద్ద డబ్బులను పోలీసులు వసూలు చేస్తుండగా, పట్టా పాసుపుస్తకం, పహాణీల కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య మాట్లాడుతూ ఉపాధి, అభివృద్ధి లేని జిల్లాగా ఏర్పాటు చేశారని వాపోయారు. జిల్లాలు ఏర్పాటు చేసింది కేసిఆర్ స్వార్థం కోసమేనని, 20 సంవత్సరాల వరకు జిల్లా అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019లో టిడిపికి వనవాసం పూర్తవుతుందని, అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాండూర్ టిడిపి ఇంచార్జి రాజుగౌడ్ మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలను ఆదుకునేందుకు లోకేష్‌బాబు ఆద్వర్యంలో సహాయనిధిని ఏర్పాటు చేశారని, కార్యకర్తలకు భీమా అందేలా కృషి చేస్తామని చెప్పారు.

తెలుగు యువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరణం రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, రేవంత్‌రెడ్డి సభకు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. సమావేశంలో టిఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కె.రంగరాజు, పట్టణ టిడిపి అధ్యక్షుడు జి.ఉమాశేఖర్, నాయకులు లక్ష్మయ్య, కిష్టయ్య, చంద్రవౌళి, గొడుగుపాండు, రాజేశ్, బస్వరాజ్, బసిరెడ్డి, సిరాజుద్దీన్, లాల్‌కృష్ణప్రసాద్, దివాకర్, పద్మాకర్, కిష్టయ్యలు పాల్గొన్నారు.