హైదరాబాద్

వీధుల్లో విభిన్న చిత్రలేఖనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: కాస్త లేటైనా..మన జిహెచ్‌ఎంసి అధికారులకు లేటెస్టు ఆలోచన తట్టింది. ఈ నెల 1 నుంచి 24 వరకు పీపుల్స్‌ప్లాజాలో జరిగిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది చిత్రకారుల పెయింటింగ్‌లను చూస్తే గానీ మన పాలకులకు మంచి ఆలోచన రాలేదు. రోడ్లకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద భవనాలకు, ప్రహరీగోడలకు అందమైన, ఆకర్షణీయమైన చిత్రలేఖనాలను వేసి ఔరా అన్పించిన ఆర్టిస్టులు సాగర తీరన తాము నిర్వహించుకున్న ఈ ఫెస్టివల్ నగరవాసులకు గుర్తిండిపోయేలా ట్యాంక్‌బండ్‌పై ‘లవ్ హైదరాబాద్’ అక్షరాల శిల్పాని ఏర్పాటు చేశారు. అంతేగాక, ఇపుడు తాజాగా రాజ్‌భవన్ ముందున్న గోడలపై కూడా అందమైన చిత్రలేఖనాలను ఆవిష్కృతం చేశారు. నగరంలోని ప్రధాన రహదార్లన్నీ కూడా ఇదే తరహాలో కాస్త కళాత్మక కోణంలో కన్పించేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి పెయింటింగ్‌లను వేయిస్తుంది. ఇందులో భాగంగానే సోమాజీగూడ రాజ్‌భవన్ ఎదురుగ గల ఎంఎస్ మక్తా ప్రధాన రహదారి గోడలపై జెఎన్‌టియు విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకే పెయింటింగ్‌లను వేసే ప్రక్రియను ప్రారంభించింది.
ఇప్పటికే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సోమాజీగూడ ఫ్లై ఓవర్‌పై వేసిన చిత్రాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్లైఓవర్‌పై వేసిన చిత్రలేఖనాలు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింభిస్తున్నాయి. గతంలో నగరం వేదికగా జరిగిన జీవవైవిధ్య సదస్సును పురస్కరించుకుని కూడా అప్పటి కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు కూడా ఇదే తరహాలో కృషి చేస్తూ జెఎన్‌టియు విద్యార్థులచే మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్‌కు చిత్రలేఖనాలను వేయించారు. ప్రస్తుతం ఆర్ట్స్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్డు సమీపంలో ఆధునిక జీవన విధానాలను ప్రతిబింబించే పెయింటింగ్‌లను వేయగా, రాజ్‌భవన్ ఎదురుగా పూర్తిగా వన్యప్రాణుల పెండింగ్‌లను జిహెచ్‌ఎంసి వేయిస్తోంది. ఈ పెయింటింగ్‌లు కూడా మరో వారం రోజుల్లో పూర్తయి, నగరవాసులను ఆకట్టుకోనున్నాయి. ఆ తర్వాత సోమాజీగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ప్రహరీగోడపై, అదే వరుసలో ఉన్న ప్రభుత్వ భవనాలై ప్రహరీగోడలపై కూడా అందమైన పెయింటింగ్‌లను వేయించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.