హైదరాబాద్

.. పాట్లు! నోట్లు.. పాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి , నవంబర్ 27: రెండు రోజులనుండి బ్యాకులకు సెలవులు దానికి తోడు ఏటిఎంలు తెరుచుకోక పోవడంతో హైటెక్ సిటి వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురు, శుక్రవారాలలో కూడా ఆయా బ్యాంకులకు కావలసినంత క్యాష్ సరఫరా చేయక పోవడంతో రెండు వేలకు మించి నగదు ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుతో కావలసినంత నగదు, చిల్లర దొరకక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులకు అందించాల్సిన నగదు చేర్చకపోవడంతో పరిస్థితి దయానీయంగా మారింది. వారానికి 24వేలు విత్‌డ్రా సౌకర్యం కేంద్రం ప్రకటించిన విధంగా ఏ బ్యాంకు నగదు పంపిణి చేయలేదు. కార్తీకమాసం కావడంతో చాలమంది భక్తులు అయ్యప్ప మాలలు వేసుకోవడంతోపాటు దీక్ష చేస్తున్నవారు పడి పూజలు కోసం బ్యాంకులకు వెళితే ఏ కార్యక్రమానికైన 2వేలే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో భక్తులులతోపాటు వివాహ శుభ కార్యాలున్నావారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండు మూడు రోజులు నోక్యాష్ బోర్డులు పెట్టేసి చేతులు దులుపుకొంటున్నారు. దాదాపుగా అన్ని శాఖలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గచ్చిబౌలి పరిధిలోని దాదాపుగా అన్ని ఏటిఎంలు మూతపడ్డాయి. అరకొరగా ఏటిఎంలలో నగదు పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అయిపోతున్నాయి. ఏటిఎంలలో కూడా 2వేలకు మించి రావడంలేదు. దానికి పెద్దలైనులు ఉంటున్నాయి. ఇక బ్యాంకుల్లో ఇప్పుడు పాత చిరిగి పోయిన రూ,10,రూ,20,రూ,50,నోట్లకి డిమాండ్‌గా మారింది. కొన్ని శాఖల్లో డబ్బులు లేవని బోర్డులు చూసి ఖాతాదారులు కనీసం పాత చిరిగిన పోయిన నోట్లైనా ఫర్వాలేదు ప్రాధేయపడి తీసుకుంటున్నారు. నోట్ల ప్రభావం సాధారణ వ్యాపారులపై తీవ్రంగా పడింది. బ్యాంకులు, ఏటిఎంల్లో డబ్బులు లేకపోవడంతో ప్రజలు డబ్బులు ఖర్చు చేయడానికి ముందుకు రావడంలేదు. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వ్యాపకాల జోలికి వెళ్లడంలేదు. దీనితో చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. హైటెక్ సిటి పరిధిలో రోడ్డు పక్కన పెట్టుకొనే చిన్నచిన్న హోటళ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్లలో సగటున రోజుకి 10నుండి 20వేలు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం 3లేక 4వేలకు మించి వ్యాపారం జరగడంలేదని చిరువ్యాపారులు వాపోతున్నారు, ఈప్రాంతంలో చిన్నపాటి హోటళ్లనుండి 5నక్షత్రాల హోటల్స్, పబ్‌లు అన్ని శని, ఆదివారల కోసం ఎదురు చూస్తుండే వారు. కారణం వారంలో జరిగే వ్యాపారం ఒక ఎత్తయితే ఈరెండు రోజులు అంతే జరుగుతుంది. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుండి చిన్నపెద్ద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికి ఇబ్బందులు తొలగి పోతాయోనని ఆందోళన చేందుతున్నారు.