హైదరాబాద్

బ్యాంకు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 27: బ్యాంకుల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశే్వశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన సిండికేట్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ జాతీయ స్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. దేశ ఆర్ధికాభివృద్ధిలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ పరిణామాలను సరిచేసేందుకు బ్యాంకు ఉద్యోగులు ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. అదేవిధంగా 26 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరవడంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు. పదవీ విరమణ అనంతరం బ్యాంకు అధికారులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ముందుంటానని తెలిపారు. నోట్ల రద్దు ప్రభావం సర్దుకోగానే ప్రతినిధి బృందం ఢిల్లీకి వస్తే ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ సిఇఓ అరుణ్ శ్రీవాత్సవ, ఆచార్య, రమేష్‌బాబు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి దుర్మరణం
మేడ్చల్, నవంబర్ 27: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందడంతో పాటు మరో నలుగురికి గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలోని అయోధ్య చౌరస్తా వద్ద ఆదివారం మధ్యాహ్నం గండిమైసమ్మ వైపు నుండి మేడ్చల్ వైపునకు వస్తున్న స్విఫ్ట్‌కారు మేడ్చల్ వైపు నుండి గడిమైసమ్మ వైపు వెళ్తున్న టాటాఏస్ వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విఫ్ట్‌కారులో ప్రయాణీస్తున్న జి. శ్రీనివాస్(42) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం సిద్ధిపేట్. టాటాఏస్ డ్రైవర్‌తో పాటు స్విఫ్ట్‌కారులో మరో ముగ్గురికి గాయాలైనట్లు, క్షతగాత్రులను 108 అత్యవసర వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మృతదేహన్ని పోస్టుమార్టం కోసం మేడ్చల్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనంతగిరిలో సందడే సందడి భక్తులు, పర్యాటకులు, సినిమా షూటింగ్‌లతో
హడావుడి
హైదరాబాద్, నవంబర్ 27: వికారాబాద్ పట్టణానికి సమీంపలోని అనంతగిరిలో ఆదివారం సందడి నెలకొంది.
కార్తీక మాసం చివరి ఆదివారం, వారాంతపు సెలవు కావడంతో అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు వనభోజనాల్లో పాల్గొన్నారు. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుండి బస్సులు, కార్లు, బైక్‌లపై పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చి అనంతగిరి అటవీ ప్రాంతంలో ఉల్లాసంగా గడిపారు. కార్తీక మాసం చివరి రోజులు కావడంతో మహిళలు ఆలయం ఆవరణలో దీపారాధన చేశారు. భక్తులు, పర్యాటకుల సందడి చాలదన్నట్లుగా వీరికి తోడు సినిమా షూటింగ్ నిర్వహించారు. అనంతగిరికి వెళ్ళే దారిలో షూటింగ్ కోసం పదుల సంఖ్యలో వాహనాలు రావడం, షూటింగ్‌లో పాల్గొనేందుకు నటీనటులు, సిబ్బంది భారీ సంఖ్యలో బారులు తీరడంతో అనంతగిరి మొత్తం జనమయమైంది.