హైదరాబాద్

ఇ-పేమెంట్ లిటరసీ శిక్షణకు బల్దియా సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: గ్రేటర్ పరిధిలో బ్యాంక్ ఖాతాలు లేని పేదలకు జన్‌ధన్ యోజన క్రింద ఖాతాలు తెరిపించడం, గ్రేటర్‌లోని ఐదు లక్షల పైచిలుకు స్వయం సహాయక బృందాల మహిళలకు నగదు రహిత చెల్లింపులపై ఇ-పేమెంట్ లిటరసీపై శిక్షణ ఇప్పించేందుకు జిహెచ్‌ఎంసి కార్యాచరణ రూపొందించింది. తద్వారా అనుత్పాదాక వ్యయాలను తగ్గించడంపై దృష్టి సారించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ ఇబ్బందులను తగ్గించడానికి చేపట్టాల్సిన ప్రణాళికపై బుధవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి.. బ్యాంకింగ్ అధికారులు, స్వయం సహాయక బృందాలు, యూసిడి విభాగం అధికారులచే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టినట్టు తెలిపారు. పట్టణ సముదాయక అభివృద్ధి విభాగంతో బ్యాంకర్ల సహాయంతో ఖాతాలు తెరిపించే ప్రక్రియను చేపట్టనున్నామని అన్నారు. బ్యాంకర్ల సహాయంతో ఆర్థిక పరమైన ఇ-పేమెంట్ లిటరసీ, అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి బ్యాంకర్లు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఖాతాలను తెరిపించడం క్రెడిట్, డెబిట్‌కార్డులను ఉపయోగించడం, మొబైల్ బ్యాంకింగ్ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు.
ఏడాది రూ.171కోట్లు రుణ సహాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు 5983 స్వయం సహాయక బృందాలకు రూ.171 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలను అందజేసినట్టు కమిషనర్ తెలిపారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు నగరంలో స్వయం సహాయ బృందాలకు రూ.1330 కోట్లను రుణాలను అందించినట్టు, దేశంలోనే ఏ ఇతర కార్పొరేషన్‌లో స్వయం సహాయక బృందాలకు ఇంత పెద్ద మొత్తంలో రుణాలను అందించలేదని వెల్లడించారు. పేద, మధ్యతరగతి వర్గాల్లో అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడం, శుభకార్యాలు, వేడుకలు, ఇతర ఉత్సవాల్లో అనవసర ఖర్చులను తగ్గించే విధంగా స్వయం సహాయక బృందాల మహిళలు ప్రయత్నించాలని సూచించారు. బ్యాంక్ రుణాలను చెల్లించని స్వయం సహాయక బృందాల మహిళల నుంచి వసూలు చేయడానికి సభ్యుల్లో కొందర్ని ప్రత్యేకంగా రుణాల వసూళ్లకు నియమించుకోవాలని కమిషనర్ సూచించారు. సామాజికవర్గ ఆదారితంగా రికవరీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
స్వయం సహాయక బృందాలకు రుణాల మంజూరు, చెల్లింపులు అంశాలపై తలెత్తే ఇబ్బందుల పరిష్కారాలకు ప్రతీ నెల సర్కిల్ స్థాయిలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని అధికారులకు కమిషనర్ జనార్ధన్ రెడ్డి సూచించారు. సమావేశానికి బ్యాంకు మేనేజర్లు, యుసిడి అధికారులు, టిఎల్‌ఎఫ్, ఎస్‌ఎల్‌ఎఫ్ ప్రతినిధులతో పాటు డిప్యూటీ కమిషనర్లు విధిగా హాజరు కావాలని సూచించారు. వీధి వ్యాపారుల సర్వేను సునామీ పద్దతిలో చేపట్టడానికి ఎస్‌హెచ్‌జిల సహకారం పొందాలని పేర్కొన్నారు.
సమావేశంలో అడిషనల్ భాస్కరాచారి, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.