హైదరాబాద్

ఈ కమిషనర్ మాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: మున్సిపల్ కమిషనర్ ఎంకెఐ అలీని కమిషనర్, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సరెండర్ చేయాలని వికారాబాద్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. బుధవారం కౌన్సిల్ హాలులో ఏర్పాటు మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శాటిలైట్ టౌన్‌షిప్ పథకం కింద పట్టణంలో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ స్వాధీనం విషయం చర్చకు వచ్చింది. మున్సిపల్ కౌన్సిల్‌కు తెలియకుండా కమిషనర్ అలీ యుజిడిని స్వాధీనం చేసుకోవడంపై రగడ మొదలైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు బి.సంజీవరావు సమక్షంలో కమిషనర్‌పై మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గతంలో పలుమార్లు యుజిడి స్వాధీనం విషయమై లేఖలు, ఒత్తిడివచ్చినా పనులు నాణ్యతాలోపం, అస్తవ్యస్తంగా జరిగాయని, స్వాధీనం చేసుకుంటే నిర్వహణ భారం పెరుగుతుందని గతంలోనే నిరాకరించామని గుర్తుచేశారు. ఈవిషయంలో శాసనసభ్యుడు సంజీవరావు సైతం తనకు కూడా తెలియకుండా ఎలా స్వాధీనం చేసుకున్నారంటూ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ రెండున్నరేళ్ళుగా సంయమనంతో పనిచేస్తున్నామని, తొమ్మిది మండి సిబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్ళినా పట్టించుకోని కమిషనర్ యుజిడి స్వాధీనంలో ఎందుకు చొరవ చూపారని ప్రశ్నించారు. యుజిడి స్వాధీనం చేసుకుంటే కౌన్సిల్ తప్పు చేసినట్టవుతుందని, చెడ్డపేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కమిషనర్ అలీ హయాంలో అవినీతి మయం చేశారని, 500, 1000 రూపాయలు లేనిదే పనులు చేయడం లేదని, తన వార్డులో హరితహారాన్ని గుంతలకే పరిమితం చేశారని ఆరోపించారు. కౌన్సిలర్ లక్ష్మికాంత్‌రెడ్డి మాట్లాడుతూ యుజిడి స్వాధీనం విషయం కనీసం ఎమ్మెల్యేకైనా చెప్పాలి కదా అని అన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ సురేష్ మాట్లాడుతూ కౌన్సిల్‌కు తెలియకుండా యుజిడిని స్వాధీనం చేసుకోవడం అవమానపర్చడమేనని తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారని కమిషనర్‌పై ధ్వజమెత్తారు. లక్షలాది రూపాయల డీజిల్ ఖర్చుపెడుతున్నా ఎందుకు పనులు జరగడంలేదని కౌన్సిలర్ నర్సింలు ధ్వజమెత్తారు. దళిత కౌన్సిలర్‌నైన తన ఇంటి వద్దకు యుజిడి పైప్‌లైన్, మంజీరా పైపులైను రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో టిఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ జి.విజయేందర్‌గౌడ్, కౌన్సిలర్లు మేక చంద్రశేఖర్‌రెడ్డి, ఇక్బాల్, ధమయంతి, నర్సింగ్‌రావు, స్వరూప, సత్యమ్మ, వెంకటేశ్వరి, నర్సింగ్‌రావు, సత్యమ్మ, సంగీత, సుచరిత, భార్గవి, మంజుల, భరత్ పాల్గొన్నారు.