హైదరాబాద్

నగదు చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా నగదు చెల్పించులకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన బ్యాంకు, పోస్టల్, కమిషన్ ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కమిషన్ ఏజెంట్లు ప్రతి రైతు ఖాతా నెంబరు సేకరించి ఒక గ్రూపుగా వివిధ బ్యాంకుల బ్యాంకులకు చెక్కులు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. బ్యాంకులో ఖాతాలేని రైతులు ఖాతా తెరిచేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను సైతం ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఫాస్ట్ డివైస్ మిషన్ ఏర్పాటుకు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసమైన గ్యాస్, కూరగాయల మార్కెట్ వంటి అవసరాలకు ప్రాధాన్యతా క్రమంలో చిన్న మొత్తము నగదును సమకూర్చాలని స్పష్టం చేశారు. మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ చెల్లింపు చేయించాలని చెప్పారు. పాత కరెన్సీ డిసెంబర్ 31 వరకు అన్ని బ్యాంకుల్లో ఖాతాల్లో వేసేందుకు వీలుందని తెలిపారు. ఎల్‌పిజి గ్యాస్ అమ్మకందార్లు స్వైపింగ్ మెషిన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్ చేసుకునే వీలుంటుందని వివరించారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా తెరవాలని, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు నెంబరు తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తే కొంత వరకు సమస్య పరిష్కరించవచ్చని ఆసోసియేషన్ సభ్యలు అభిప్రాయపడ్డారు.
రైతులకు చెల్లింపులకు సంబంధించి మెసేజ్ అందేవిధంగా మొబైల్ నెంబర్ అటాచ్ చేయాలని, అసోసియేషన్ సభ్యులను కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దారు. పౌరసరఫరాల డిఎం విజయ్ మోహన్, డిఎస్‌వో పద్మజ, ఎస్‌బిహెచ్, ఆంధ్రా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.