హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో క్రీడాకారులకు ఐదు శాతం రిజర్వేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రతిభ కనపర్చిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదుశాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తామని, అందుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాధికార సంస్థ(శాట్స్) చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శాట్స్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి లాల్‌బహదూర్ స్టేడియంలోని ఎఫ్‌ఎంసి హాలులో బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వివిధ పత్రికలు, చానల్స్‌కు చెందిన క్రీడా ప్రతినిధులు మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న నియామకాల్లో క్రీడాకారులకు తగిన ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగ ఆవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్‌ను క్రీడాకారులకు కల్పించాలని, సంబంధించి త్వరలో సిఎం సమక్షంలో క్రీడా మంత్రి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియమకాల్లో తగిన ప్రాధాన్యతను క్రీడాకారులకు కల్పించాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాలసీని రూపొందించిందని, అవసరమైతే క్రీడల్లో అనుభవం కలిగిన వారి సూచనలు, సలహాలను తీసుకుని పాలసీలో మరిన్ని మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి తగిన నగదు పురస్కారాలను అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రస్తుతం పర్మినెంట్ కోచ్‌లు 46మంది, పార్ట్‌టైమ్ కోచ్‌లు 30మంది, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి కలెక్టర్ల పర్యవేక్షణలో 44మంది కోచ్‌లు పనిచేస్తున్నారు. కోచ్‌ల సంఖ్యను పెంచుతామని, సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించి సుమారు 200 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, ఇక్కడ భారత స్పోర్ట్స్ అథారిటీ(సాయ్) సబ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, క్రీడల మంత్రి టి.పద్మారావు నేతృత్వంలో సమావేశం నిర్వహించి అనంతరం లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. మారుమూల గ్రామం నుండి క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి మండలానికి ఒక కోచ్‌ను నియమిస్తామని పేర్కొన్నారు. కోచ్‌ల కొరత అధికంగా ఉన్నందున 31 క్రీడాంశాల్లో కోచ్‌లను నియమిస్తామని తెలిపారు. త్వరలో నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో క్రీడా వౌలిక వసతులను పెంచేందుకు జిల్లాల వారీగా స్పోర్ట్స్ హాస్టళ్లు, అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు.
ఒఎటిని గుర్తించాము
తెలంగాణ రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ రాష్ట్రంలోని ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ (ఒఎటి)ను గుర్తించిందని సంస్థ అనుబందం ఇవ్వడం జరిగిందని ఎండి, విసి ఎ.దినకర్‌బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ఒలింపిక్ సంఘం(టిఒఎ), ఒలంపిక్ సంఘం తెలంగాణ (ఒఎటి) విషయంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు శాట్స్ ఎండి సమాధానం ఇచ్చారు. రెండు క్రీడా సంఘాలకు సంబంధించి వివాదాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ప్రస్తుతం ఒఎటికే శాట్స్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శాట్స్ అధికారులు డి.విమలకార్‌రావు, జిఎ.శోభా, వెంకట్మ్రణ, డాక్టర్ బి.సోమలింగం పాల్గొన్నారు.

ఎస్‌జిఎఫ్‌ఐ జాతీయ త్రోబాల్
చాంప్స్ తెలంగాణ, ఢిల్లీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 62వ భారత స్కూల్ గేమ్స్ సమాఖ్య అండర్-19 బాలబాలికల త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఢిల్లీ జట్లు విజేతగా నిలిచాయి. అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ మైదానంలో జరిగిన బాలికల విభాగం ఫైనల్లో తెలంగాణ జట్టు 15-9, 12-15, 15-11 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి కర్నాటకపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 15-8, 12-15, 15-13 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి హర్యానపై గెలుపొందింది. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టు 15-13, 15-12 స్కోరుతో తెలంగాణపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చత్తీస్‌గడ్ 15-9, 12-15, 15-11 పాయింట్లతో కర్నాటకపై గెలుపొందింది. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లవి గ్రూప్ స్కూల్స్, ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కకోమరయ్య విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అంతర్జాతీయ క్రికెటర్ తిరుమల్‌షెట్టి సుమన్, అతిథులుగా భారత త్రోబాల్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి నరేష్‌మాన్, టెక్నోజెన్స్ సంస్థ ఎండి కల్యాణ్‌చక్రవర్తి, ఎస్‌జిఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు రామ్‌రెడ్డి, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీర్‌నాగి, తెలంగాణ త్రోబాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పి.జగన్‌మోహన్ గౌడ్, కోశాధికారి కొమ్ము వెంకట్ పాల్గొన్నారు.
హెచ్‌సిసిఎల్ కార్పొరేటర్స్
క్రికెట్ లీగ్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్ మహానగరంలో ఔత్సాహికులైన యువ క్రికెటర్‌లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరంలో అవిన్ ఎంటర్‌టైనె్మంట్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్పొరేటర్స్ క్రికెట్ లీగ్ (హెచ్‌సిఎల్) 2016 బుధవారం ప్రారంభమైంది. నాకౌట్ పద్ధతిలో జరుగనున్న టోర్నమెంట్‌లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 మంది కార్పొరేటర్‌ల సారథ్యంలో 150 జట్లు పాల్గొంటాయి. కార్పొరేటర్‌లతో కలిసి టోర్నమెంట్‌లో మొత్తం 2250 మంది క్రికెటర్లు పాల్గొంటారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 22 వరకు టోర్నమెంట్ కొనసాగుతుందని అవీన్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు అవినాష్‌బాబు, హెచ్‌సిసిఎల్ అధ్యక్షుడు ఎం.మారయ్య తెలిపారు. టోర్నమెంట్‌లో జరుగనున్న 149 మ్యాచ్‌లు నాగోల్‌లోని సిఎన్‌ఆర్ మైదానంలో జరుగుతాయి. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగింది. హెచ్‌సిసిఎల్-2016 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్‌రెడ్డి విచ్చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ మాట్లాడుతూ నేటి తరం యువత పెడదారిన పట్టకుండా వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది గొప్ప క్రీడాకారులుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపి జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, ఎమ్మెల్యే వివేక్‌గౌడ్, అవిన్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు జనగామ అవినాష్ పాల్గొన్నారు.