హైదరాబాద్

దిగొచ్చిన ‘పసిడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: నిన్నమొన్నటి వరకు కొండెక్కిన బంగారం ధర ఇపుడు పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దిగొచ్చింది. గత నెల 8వ తేదీన వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా రూ. 40వేల నుంచి రూ. 45 వేల వరకు కూడా అమ్ముడుపోయిన బంగారం విక్రయాలు రెండువారాలుగా మార్కెట్‌లో నగదు, చిల్లర కొరతతో ఇపుడు ఏకంగా 80 శాతం వరకు పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దీ తర్వాత నగరంలో బంగారం క్రయ విక్రయాలు ఎక్కువగా జరిగే సికిందరాబాద్ జనరల్ బజార్, బేగంబజార్‌తో పాటు పేరుగాంచిన జ్యుయలెరీ షాపుల్లో పెళ్లిళ్ల కారణంగా అంతంతమాత్రంగా వినియోగదారులు కన్పించేవారు. కానీ గురువారం కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులను విధిస్తూ ప్రకటన చేయటంతో ఒక్కసారిగా నగల షాపులు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా నిన్నమొన్నటి వరకు బ్యాంకు ఖాతాల్లో నగదుపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇపుడు వివాహితలు, అవివాహితల వద్ధ ఉండాల్సిన బంగారాన్ని 500 గ్రాములు, 250 గ్రాముల వరకు పరిమితం చేస్తూ ప్రకటన చేయటంతో గురువారం పది గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 27వేలకు పడిపోయింది. వెయ్యి, 500 నోట్ల రద్దు కారణంగా స్తంభించిన లావాదేవీలు పుంజుకునే వరకు బంగారం విక్రయాలు ఇలాగే ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పండుగొచ్చినా, పబ్బమొచ్చినా, ఇంట్లో శుభ కార్యాలున్నా, కొనుగోలుదార్లుతో కిటకిటలాడే బంగారు ఆభరణాలు విక్రయించే షాపులు ఇపుడు వినియోగదారుల్లేక వెలవెలబోతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత తీరి, స్తంభించిన లావాదేవీలు పూర్తి స్థాయిలో గాడిన పడిన తర్వాతే మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయి.