హైదరాబాద్

నగరాభివృద్ధిలో అన్ని పార్టీలను కలుపుకుపోతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్ మహానగరాభివృద్దిలో అన్ని పార్టీలను కలుపుకుపోతామని మంత్రి కె. తారకరమారావు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నగరాభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రతి మూడు నెలలకో సారి ఇలాంటి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కిలోమీటర్లకు గాను 216 కిలోమీటర్ల మేర నాలల సర్వే పూర్తిచేశామని మొత్తం 8239 అక్రమ కట్టాలను గుర్తించినట్టు చెప్పారు. నాలాల విస్తరణ నేపధ్యంలో సాధ్యమైనంత మేర ఇళ్ల తొలగింపు లేకుండా చూసేలా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రీ కాస్టింగ్ విధానంలో నాలాల నిర్మాణం, పనులను కొంత మంది కాంట్రాక్టర్లకే పరిమితం చేయకుండా కొత్తగా ముందుకొచ్చే యువతీయువలకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. వాల్ పోస్టర్లు, రాతల నిషేధం, ఫ్లెక్సీలు, ఫ్లాస్టిక్ నిషేధానికి పార్టీలు కలిసి రావాలని కోరగా ప్రజా ప్రతినిధులందరూ అంగీకరించినట్టు చెప్పారు.
అదే విధంగా రోడ్ల మరమత్తులు, విస్తరణకు ప్రణాళిక, 75 కోట్లతో టెండర్లకు నిర్ణయించినట్టు తెలిపారు. నగరాభివృద్ధిపై, నగరవాసులపై నోట్ల రద్దు ప్రభావం వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. నోట్ల రద్దు నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం 150 చోట్ల రూ. 5 భోజనాన్ని ఏర్పాటు చేయడం, వాటర్ వర్క్స్, జిహెచ్‌ఎంసిల సమన్వయంతో ముందుకు సాగడం వంటి నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. శివారు మున్సిపాలిటీల్లో 2000 కోట్లతో 2700 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు నిర్మాణం చేట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడం, పనులు జరుగుతున్న చోట ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పనులు ఎప్పటి వరకు పూర్తి అవుతాయో అందులో పొందుపరచాలని నిర్ణయించామని చెప్పారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.